నాగ చైతన్య మజిలీ సినిమా ఇన్స్పిరేషన్ తో మరో సినిమా.. బ్లాక్ బస్టర్ పక్కా అంటున్నారు ..!

నాగ చైతన్య మజిలీ సినిమా లో క్రికెటర్ గా కనిపించాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నాగ చైతన్య నటించిన మజిలీ చిత్రానికి నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబట్టింది. లవ్ స్టోరీస్ చేస్తూ వస్తున్న నాగ చైతన్య మొదటిసారి క్రీడా నేపథ్యంలో సాగే కథ లో నటించి రూట్ మార్చాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో పాటు మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ మజిలీ అటు నాగ చైతన్య కి ఇటు సమంత కి మైల్ స్టోన్ మూవీ లా నిలిచిపోతుంది. అయితే మజిలీ తర్వాత నాగ చైతన్య ఆ సక్సస్ ని కంటిన్యూ చేయడానికి కథల ఎంపిక విషయంలో పక్కాగా ఉంటున్నాడు.

Majili - Movie Review - Just for Movie Freaks

ఈ క్రమంలోనే ఇప్పుడు హాకీ క్రీడా నేపథ్యంలో థ్యాంక్యూ అన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చేయడానికి నాగ చైతన్య కి మజిలీ సినిమా ఒకరకంగా ఇన్స్పిరేషన్ అని మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాకి విక్రం కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. విక్రం కుమార్ తీసిన సినిమాలు గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలుస్తున్నాయి. అయినా మనం సినిమా తో విక్రం కుమార్ కి అక్కినేని ఫ్యామిలీ తో ఏర్పడిన బాండింగ్ వల్ల అక్కినేని హీరోలు విక్రం కుమార్ తో సినిమాలు చేస్తున్నారు.

Love Story (Telugu) Movie | Cast, Release Date, Trailer, Posters, Reviews,  News, Photos & Videos | Moviekoop

అయితే ఈ సారి మాత్రం విక్రం కుమార్.. నాగ చైతన్య తో చేస్తున్న థ్యాంక్యూ సినిమాతో భారీ సక్సస్ ని అందుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అన్న సినిమాని పూర్తి చేశాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలని జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో నాగ చైతన్య మొదటిసారి తెలంగాణా యాసలో మాట్లాడబోతున్నాడు. మజిలీ తర్వాత వస్తున్న లవ్ స్టోరీ సినిమా మీద భారీ అంచనాలున్నాయి.