అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగచైతన్య గురించి అందరికీ సుపరిచితమే.ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న నాగచైతన్య సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులతో దూరమైన ఈ జంట ప్రస్తుతం వారి దృష్టి మొత్తం సినీ కెరియర్ పై పెట్టారు. ఇకపోతే విడాకుల అనంతరం నాగచైతన్య లవ్ స్టోరీ బంగార్రాజు వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఈయన నటించిన థాంక్యు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకొని జూలై 8 వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైన విషయం మనకు తెలిసిందే. ఇందులో నాగచైతన్య చెప్పిన డైలాగులు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ నా జీవితంలో నీకు తప్ప మరొకరికి చోటులేదు.
నా లైఫ్ లో ఎన్నో వదులుకొని ఇక్కడి వరకు వచ్చాను.. ఇక కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. నన్ను నేను సరి చేసుకోవడం కోసం నేను చేస్తున్న ప్రయత్నం ఇది అంటూ చైతన్య చెప్పిన డైలాగ్స్ ఆయన నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉండడంతో ఈ డైలాగ్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. లవ్ ట్రాక్ రొమాంటిక్ కామెడీ తరహాలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగ చైతన్య సరసన రాశి ఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించగా అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.