Home News బిగ్ బాస్ షోపై మెగా బ్ర‌ద‌ర్ స్పంద‌న‌.. ఆ ఇద్ద‌రికీ స‌పోర్ట్ చేయండంటూ వీడియో విడుద‌ల‌

బిగ్ బాస్ షోపై మెగా బ్ర‌ద‌ర్ స్పంద‌న‌.. ఆ ఇద్ద‌రికీ స‌పోర్ట్ చేయండంటూ వీడియో విడుద‌ల‌

బుల్లితెర బిగ్ రియాలిటీ షో సెల‌బ్రిటీల దృష్టిని కూడా ఆక‌ర్షిస్తుంది. చాలా మంది ప్ర‌ముఖులు ఈ షోపై ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తూ త‌మ‌కు ఫేవ‌రేట్ కంటెస్టెంట్స్ అయిన వారిని గెలిపించ‌మ‌ని సోష‌ల్ మీడియా ద్వారా కోరుతున్నారు. సీజ‌న్ 4లో ఇప్ప‌టికే 11 వారాలు పూర్తి చేసుకోగా, హౌజ్‌లో ఏడుగురు స‌భ్యులు ఉన్నారు. ఇందులో ఎవ‌రు విజేత‌గా నిలుస్తారు, ఎవ‌రు ర‌న్న‌ర‌ప్ అవుతారు అనే దానిపై అంత‌టా హాట‌హాట్ చర్చ‌లు న‌డుస్తున్నాయి. గేమ్ చివరి ద‌శ‌కు చేరుకోవ‌డంతో స్టార్స్ కూడా మీడియా ముందుకు వ‌చ్చి త‌మ ఫేవ‌రేట్ కంటెస్టెంట్స్‌కు స‌పోర్ట్ చేస్తున్నారు.

Nagaaa | Telugu Rajyam

తాజాగా మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు వీడియో ద్వారా బిగ్ బాస్ షోపై త‌న స్పంద‌న వినిపించారు. అవినాష్‌, అభిజిత్‌ల‌ను స‌పోర్ట్ చేయండంటూ త‌న అభిమానుల‌ని కోరాడు. అవినాష్ నాకు చాలా కాలంగా తెలుసు. ఒక్కోసారి అత‌ని ప్ర‌వ‌ర్త‌న నెగెటివ్ అయ్యేలా చేసింది. నాకు తెలిసినంత‌వ‌ర‌కు అవినాష్ అంత‌గా ఎమోష‌న్ కాడు. కాక‌పోతే హౌజ్‌లో ఉన్న ప‌రిస్థితుల వ‌ల‌న అత‌ను అలా భావోద్వేగానికి గురై ఉంటాడ‌ని నాగబాబు పేర్కొన్నారు. ఇక నాకు బాగా న‌చ్చిన కంటెస్టెంట్ అభిజ‌త్, అత‌ని వ్య‌క్తిత్వం చాలా న‌చ్చుతుంద‌ని నాగ‌బాబు స్ప‌ష్టం చేశారు.

అభిజిత్‌ని గ‌తంలో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీ షూటింగ్ స‌మ‌యంలో క‌లిసాను. తొలి ప‌రిచ‌య‌మే మంచిగా అనిపించింది. బాగా క‌ష్ట‌ప‌డ‌తాడు. అత‌నికి ఓ మంచి హిట్ దొరికి ఉంటే బాగుండు అనిపించింది. ఇప్పుడు బిగ్ బాస్ లో అభిజీత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉండ‌డం ఆనందాన్ని క‌లిగిస్తుంది. వ్యక్తిగతంగా అవినాష్‌కి నా సపోర్ట్‌ ఉన్నా కూడా నా మనసు, నా ఇష్టం మాత్రం అభిజిత్‌పైనే ఉంది. వాళ్లిద్ద‌రికి స‌పోర్ట్ చేయ‌మ‌ని న‌న్ను ఎవ‌రు అడ‌గ‌లేదు. కాని నాకు వారిద్ద‌రిని స‌పోర్ట్ చేయాల‌ని అనిపించింది. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు గెలిచిన నాకు ఇష్ట‌మే. వారిద్ద‌రిని మీ ఓట్ల‌తో ఫైన‌ల్ వ‌ర‌కు తీసుకురండ‌ని నాగబాబు పేర్కొన్నారు. రీసెంట్‌గా రాహుల్ సిప్లిగంజ్ .. మోనాల్, అరియానాల‌ని స‌పోర్ట్ చేయ‌మ‌ని కోరిన సంగ‌తి తెలిసిందే

- Advertisement -

Related Posts

షాకింగ్ : జైలుకి వెళ్లబోతోన్న టాలీవుడ్ యంగ్ హీరో ??

టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే కెరీర్ లో సెటిలవబోతున్న ఒక యంగ్ హీరో జైలుకి వెళ్ళే అవకాశాలున్నాయని ఫిల్మ్ నగర్ లో అలాగే సోషల్ మీడియాలోనూ న్యుస్ వైరల్ గా మారింది. సినిమాలలో నటించాలని...

అమ్మ బాబోయ్ ఆ పనులు కూడా మొదలెట్టేసింది.. వంటలక్క మామూల్ది కాదు!!

కార్తీకదీపం సీరియల్‌కు ఉన్న ఫాలోయింగ్.. వంటలక్క అలియాస్ దీప పాత్రను అద్భుతంగా పోషిస్తోన్న ప్రేమీ విశ్వనాథ్‌కు ఉన్న ఫాలోయింగ్ స్టార్ హీరోయిన్లకు కూడా ఉండదేమో. ప్రేమీ విశ్వనాథ్ అంటే ఎవ్వరైనా గుర్తు పడతారో...

ఆర్ఆర్ఆర్ కి రాజమౌళి ఒకే ఒక్క ఫోటో తో ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చాడు..!

ఆర్ఆర్ఆర్ టాలీవుడ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా. లాక్ డౌన్ తర్వాత శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా తాజా అప్ డేట్ ను ఇచ్చారు రాజమౌళి బృందం. సంక్రాంతి...

ఇలా ముద్దులు పెట్టేస్తోందేంటి?.. రెచ్చగొడుతోన్న పాయల్

పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎంత బోల్డ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆర్ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకుంది. ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్ క్రేజీ...

Latest News