Naga Babu: చిరంజీవి బాలయ్య స్కిట్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు… వీడియో వైరల్!

Naga Babu: చిరంజీవి తమ్ముడు నవ్వుల రారాజు నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలు సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగబాబు గత కొంతకాలం క్రితం ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోకి జడ్జిగా వ్యవహరించాడు. తర్వాత మళ్ళీ మల్లెమాల వారితో వచ్చిన కొన్ని మనస్పర్థల కారణంగా నాగబాబు అక్కడి నుండి బయటికి వచ్చేశాడు. ప్రస్తుతం మా టీవీలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్ అని షోకి వ్యవహరిస్తున్నాడు. నాగబాబు ఇలా జడ్జిగా మాత్రమే కాకుండా ఏపీలో అధికార పార్టీ మీద నిప్పులు చేరుగుతూ.. ఏదో ఒక విధంగా అధికార పార్టీ నాయకుల మీద సెటైర్లు వేస్తూ ఉంటాడు.

ఇదిలా ఉండగా నాగబాబు జడ్జిగా వ్యవహరిస్తున్న కామెడీ స్టార్స్ షో కి సంబంధించిన ప్రోమో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వారం ప్రసారం కాబోయే ఈ షోలో అదిరే అభి,అవినాష్ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా స్పూప్ చేశారు. ఈ స్కిట్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కి బదులు చిరంజీవి, బాలకృష్ణ లాగ గెటప్ వేసుకొని కామెడీ చేశారు. ఈ స్కిట్ లో బాలకృష్ణగా అవినాష్ చేసిన కామెడీ చాలా అతిగా కనిపిస్తుంది. సినిమాలు ఎన్టీఆర్ కి పులికి మధ్య ఉన్న సన్నివేశం లాగా స్కిట్ లో కూడా అవినాష్ పులినీ భయపెడతాడు. అంతేకాకుండా పాము కూడా బాలకృష్ణ చెప్పేమాట విని తనని తానే కాటేసుకున్నట్టు చూపించారు.

YouTube video player

మొత్తానికి ఈ స్కిట్ చూసి అక్కడున్న వారందరూ చాలా నవ్వుకున్నారు. స్కిట్ అయిపోయిన తర్వాత అవినాష్, అభి మాట్లాడుతూ ఈ స్కిట్ ఎవరినీ కించపరచడానికి కాకుండా చిరంజీవి, బాలకృష్ణ గారి మధ్య ఉన్న స్నేహ బంధం గురించి చెప్పాలన్న ఉద్దేశంతోనే వేశామని తెలిపారు. ఈ స్కిట్ గురించి నాగబాబు కామెంట్స్ ఇస్తూ స్కిట్ చాలా బాగా చేశారని మెచ్చుకున్నాడు. మీరు ఎవరిని అగౌరవపరిచే లేదు నాది హామీ అంటూ ఈ స్కిట్ గురించి నాగబాబు కామెంట్ చేశారు. ఈ స్కిట్ లో అవినాష్ ఓవరాక్షన్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.