నిర్మాతలను ఎన్ని రకాలుగా హింసపెట్టావో నాకు తెలుసు.. ప్రకాష్ రాష్ గుట్టువిప్పిన నాగబాబు

Naga Babu counter To Prakash Raj Comments On Pawan Kalyan

ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. రాజకీయాలపై ప్రశ్నలు సంధిస్తూ ప్రభుత్వాలను ప్రశ్నిస్తుంటారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్‌పై బీజేపీ వ్యతిరేకి అనే ముద్రపడింది. అదంతా కాసేపు పక్కన పెడితే తాజాగా ప్రకాష్ రాజ్.. పవన్ కళ్యాణ్, జనసేనలపై విరుచుకుపడ్డాడు. పవన్ కళ్యాణ్ ఊసరవెల్లి అని దారుణమైన కామెంట్స్ చేశాడు. వీటిపై నాగబాబు స్పందించాడు. అయితే ప్రకాష్ రాజ్ సినిమా జీవితాన్ని కూడా బయటకు లాగాడు.

Naga Babu counter To Prakash Raj Comments On Pawan Kalyan
Naga Babu counter To Prakash Raj Comments On Pawan Kalyan

అసలే ప్రకాష్ రాజ్ దర్శకనిర్మాతలను కాల్చుకుతింటాడనే అపవాదుంది. సెట్‌కు టైంకు రాడని అందరూ చెప్పే మాటే. అందుకే ఆ మధ్య తెలుగులో ప్రకాష్ రాజ్‌ను బ్యాన్ చేసినట్టుగా ఒక్క సినిమాలోకి తీసుకోలేదు. అప్పుడు వచ్చిన రూమర్లకు నాగబాబు ఇప్పుడు చేసిన కామెంట్లకు సంబంధం ఉందనిపిస్తోంది. ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా విమర్శిస్తే నాగబాబు మాత్రం ప్రకాష్ రాజ్‌ను వృత్తిపరంగా, వ్యక్తిగతంగా దూషించాడు.

ప్రకాష్ రాజ్‌ను విమర్శిస్తూ రాసిన పోస్ట్‌లో సినీ లైఫ్ గురించి చెప్పుకొచ్చాడు. నిర్మాతలని ఎన్ని రకాలుగా డబ్బు కోసం హింస పెట్టావో, ఇచ్చిన డేట్స్‌ని క్యాన్సిల్ చేసి ఎంత హింసకి గురి చేశావో ఇంకా గుర్తున్నాయి.. ప్రకాష్ రాజ్. ముందు నువ్వు మంచి మనిషిగా తయారయ్యి అప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఓ మంచి మనిషి నిస్వార్థ పరుడైన నాయకుడిని విమర్శించు. డైరెక్టర్స్‌ని కాకపట్టి నిర్మాతలని కాల్చుకుతిన్న నీకు ఇంతకన్నా మంచిగా మాట్టాడ్డం ఏమి తెలుసంటూ దారుణంగా విమర్శించాడు.