ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకి ఘాటుగా స్పందిస్తూ నాగ బాబు కౌంటర్..!

రీసెంట్ గా రాజకీయల పట్ల జనేనాని పవన్ కళ్యాణ్ తీరుని తప్పు పడుతూ సినీ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించాడు. అయితే ఈ విషయంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ని తప్పు పడుతూ ‘నువ్వొక లీడర్… మీకొక పార్టీ ఉంది. మళ్లీ ఇంకో నాయకుడి వైపు వేలు చూపించడం ఏంటి?.. ఏపీలో గాని ఇంకో చోట గాని.. జనసేన ఓట్ షేర్ ఎంత.. బీజేపీ ఓటు షేర్ ఏంటి? 2014లో మీరే బీజేపీ వాళ్లు అద్భుతం అన్నారు.

Arguments between Prakash Raj & Pawan Kalyan

మళ్లీ గత ఎన్నికల్లో లేదు వాళ్లు ద్రోహులు అన్నారు. మళ్లీ ఇప్పుడు వీళ్లే నాయకులు.. అంటున్నారు. ఇలా మూడు నాలుగు సార్లు మారుతున్నారంటే.. మీరు ఊసరవెల్లి అయి ఉండాలి కదా’ అంటూ ప్రకాష్ రాజ్ విమర్శించిన మాట వాస్తవమే. అయితే ఇందుకు పవన్ కళ్యాణ్ స్పందించకపోయినా ఆయన బ్రదర్ నాగబాబు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తూ ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చాడు.

ప్రకాష్ రాజ్ కి నా ఆన్సర్ అంటూ ”రాజకీయాల్లో నిర్ణయాలు అనేకసార్లు మారుతుంటాయి. బట్ ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశ్యాలు లాంగ్ టర్మ్ లో ప్రజలకు పార్టీకి ఉపయోగపడే విధంగా ఉంటాయి. మా నాయకుడు పవన్ కళ్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపడం వెనుక ప్రజలకి ఉపయోగపడే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నమ్ముతున్నాము. పవన్ కళ్యాణ్ ఎవరికి ద్రోహం చేశాడని ప్రతి పనికిమాలినవాడు విమర్శిస్తున్నాడు. మిస్టర్ ప్రకాష్ రాజ్.. నీ డొల్లతనం ఏంటో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి డిబేట్ లోనే తెలిసింది.

సుబ్రహ్మణ్య స్వామి నిన్ను తొక్కి నారతీస్తుంటే మాట్లాడలేక తడబడటం నాకు ఇంకా గుర్తుంది. బీజేపీ తీసుకునే నిర్ణయాలు నీకు నచ్చకపోతే విమర్శించు తప్పులేదు. అలాగే బీజేపీ గాని మరే పార్టీ గాని మంచి చేస్తే హర్షించగలగాలి. విమర్శించడం తప్ప మంచి చేస్తే మెచ్చుకోలేని నీ కుసంస్కారం గురించి ఏం చెప్పగలం. ఒకటి మాత్రం చెప్పగలను. ఈ దేశానికి బీజేపీ ఏపీకి జనసేన పార్టీతోనే అభివృద్ధి సాధ్యం.

నీలాంటి లాంటి వాళ్ళు ఎన్ని మాట్లాడినా బీజేపీ – జనసేన కూటమి ని ఏం చేయలేవు… అంటూ నాగాబాబు ప్రకాష్ రాన్ ని ఉద్దేశించి అన్నారు. బీజేపీ నేతల్ని నువ్వు ఎన్ని మాటల అన్నా వాళ్లు నిన్ను ఏమీ అనడం లేదంటే ఆ పార్టీ ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ ఏంటో అర్థం చేసుకో… అంటు ట్విట్టర్ ద్వారా పలు వ్యాఖ్యలతో ప్రకాష్ రాజ్ కి సూటిగానే సమాధానం చెప్పాడు మెగా బ్రదర్ నాగబాబు.