వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రభాస్ చేస్తున్న బిగ్గెస్ట్ ఫ్యాన్ వరల్డ్ ప్రాజెక్ట్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కల్కి 2898 AD టైటిల్ తో ఇటీవల అమెరికాలో భారీ స్థాయిలో ఫస్ట్ లుక్ గ్లింప్స్ అయితే విడుదల చేశారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దాదాపు 550 కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నారు.
ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతున్నట్లు సమాచారం. అయితే సినిమా గ్లింప్స్ అయితే అనుకున్నంత స్థాయిలో రీచ్ కాలేదు అని తెలుస్తోంది. ముఖ్యంగా సలార్ టీజర్ కంటే తక్కువ స్థాయిలోనే కల్కి కి రెస్పాన్స్ వచ్చింది. నిజానికి ఆ సినిమా కంటే ఎక్కువ స్థాయిలో రావాలి. ఎందుకంటే పాన్ వరల్డ్ రేంజ్ లో హాలీవుడ్ కు ధీటుగా ఈ సినిమాను నిర్మించాలని అనుకుంటున్నారు.
దానికి తోడు స్టార్ కాస్ట్ కూడా గట్టిగానే ఉంది. కమల్ హాసన్ ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నాడు. ఇక ఇటీవల దర్శకుడు నాగ్ అశ్విన్ మరోసారి చిత్ర యూనిట్ సభ్యులతో కూర్చొని అసలు కల్కి కి ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది అనే విషయంపై దీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ప్రతి మార్కెట్లో సినిమాకు ఎంత డిమాండ్ ఉంది అలాగే వచ్చిన గ్లింప్స్ వివిధ రకాల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో ఏ తరహా రెస్పాన్స్ అందుకుంది అనే విషయంపై కూడా రివ్యూ జరుపుతున్నారు.
ఇక రెస్పాన్స్ సరిగ్గా రాని భాషలలో సినిమాపై మరింత ఎక్కువ స్థాయిలో ప్రమోషన్స్ చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల కాబోతోంది. కాబట్టి ఆ తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన ఏదైనా స్పెషల్ అప్డేట్ తో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాకు ప్రమోషన్స్ విషయంలో అయితే కాంప్రమైజ్ కాకూడదు అని ఆలోచిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో కల్కి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.