ప్రస్తుతం దేశమంతా ఎడ తెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముంబై..అస్సాం రాష్ర్టాలను ప్రతీ ఏడాదిలోనే ఈ ఏడాది కూడా వర్షాలు ముంచెత్తాయి. అక్కడి ప్రజలకు ఈ వర్షాలు ..వరదలు అలవాటుగా మారిపోయాయి. మరీ ముఖ్యంగా అస్సాం ప్రజలు దృష్టిలో వర్షాలంటే! వరదలతో సమానం. దశాబ్ధాలుగా ఆ జీవితాలు వరదల్లోనే మగ్గిపోతున్నాయి. వరదలు కారణంగా ఆప్తుల్ని కోలుపోవడం..తిండి కోసం ఎదురుచూడటం . ఇలా వాళ్ల జీవితాలు ఆ సీజన్ లో అంథకారంలోకి వెళ్లిపోతాయి. దాదాపు ఇలాంటి ఎక్స్ పీరియన్స్ నే హాట్ బ్యూటీ నభా నటేష్ అలియాస్ టర్కీకోడి ఓసారి అనుభవించిందిట.
ఓ రోజు రాత్రంతా వర్షాల్లో..వరదల్లో గడపాల్సి వచ్చిందని ఆ కాల రాత్రిని నెమర వేసుకుంది. అలాంటి స్పాట్ ని టూరింగ్ ప్లేస్ గా జీవితంలో మళ్లీ ఎంపిక చేసుకోకూడదని భయాన్ని వ్యక్తం చేసింది. మరి అస్సాంలో వరదలు వస్తాయని తెలిసి ఎందుకు వెళ్లారంటే? అదంతా స్నేహితులు చేసిన పనిగా తేల్చేసింది. సరిగ్గా వర్షాల సీజన్ ప్రారంభ సమయంలోనే కజిరంగా పార్క్ ని చూడటానికి వెళ్లారంట. దీంతో ఒక్కసారిగా మధ్నాహ్నం అయ్యే సరికి భారీగా ఉరుములు..మెరుపులతో కూడిన వర్షం మొదలైందిట. దగ్గరగా రిసాట్స్ ఉన్నా! అందులో సరైన సౌకర్యాలు లేకపోవడం..వర్షం నీరు రిసార్స్ట్ లోకి చేరుకోవడంతో ఆ రాత్రంతా బాగా ఇబ్బంది పడాల్సి వచ్చిందని అనాటి అనుభవాన్ని గుర్తు చేసుకుంది.
ప్రస్తుతం నభా నటేష్ `అల్లుడు అదుర్స్` సినిమాలో నటిస్తోంది. కరోనా కారణంగా రిలీజ్ అవ్వాల్సిన `సోలో బ్రతుకే సోబెటర్` ఎటూ కాకుండా అయింది. ఆ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలా? నేరుగా థియేటర్ లో రిలీజ్ చేయాలా? అన్న దానిపై తర్జన భర్జన జరుగుతోంది. థియేటర్లు ఇప్పట్లో తెరుచుకున్నా జనాలు చూడటానికి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఓటీటీకే వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. `ఇస్మార్ట్ శంకర్` తో లైమ్ లైట్ లోకి వచ్చిన అమ్మడు అటుపై కొన్ని సినిమాలు చేసినా సరైన సక్సెస్ రాని సంగతి తెలిసిందే.