మళ్ళీ ఓటిటి లో విడుదల అవ్వనున్న నాని కొత్త సినిమా….!

నేచురల్ స్టార్ నాని తన ప్రతి సినిమాలో కొత్తదనం ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ఒక సారి కామెడీ ఎంటర్టైనర్ తో వస్తే మరోసారి విలన్ గా వచ్చేస్తాడు. ఇక మరోసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తాడు. ఇక ప్రతిసారి తనను తాను కొత్తగా చూపే నాని ఇక రీసెంట్ గా శ్యామ్ సింగ్ రాయ్ సినిమాతో క్లాసిక్ హిట్ అందుకున్నాడు. ఇక ఇపుడు అంటే సుందరానికి అంటూ నవ్వించడానికి వస్తున్నాడు.

ఇక ఇపుడు మరో విభిన్న కథాంశంతో రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పైగా ఈసినిమా ను ఓటిటి లో విడుదల చేయాలనుకుంటున్నాడట నాని. నాని నే నిర్మిస్తున్న ఈ సినిమాను ఓటిటి లో విడుదల చేయడమే ఈ సినిమాకు ప్లస్ అని అలా డిసైడ్ అయ్యాడట. కరోనా సమయంలో నేచురల్‌ స్టార్‌ నాని నటించిన ‘వి, టక్‌ జగదీశ్‌’ చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే.

నాని ప్రొడక్షన్‌లో ఆయన సోదరి దీప్తి దర్శకత్వం వహించిన చిత్రం ‘మీట్‌ క్యూట్‌’. నాని స్వయంగా నిర్మించిన ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ద్వారా విడుదల చేస్తారట.పలు కథల నేపథ్యంలో, అంథోలజీ సినిమాగా రూపొందిన ఈ చిత్రం ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్నట్లు సమాచారం. 5 విభిన్న కథానాల నేపథ్యంలో సాగే ఈ సినిమా బాహుబలి కట్టప్ప సత్యరాజ్‌, శివ కందుకూరి, దీక్షిత్‌ శెట్టి, రూహాని శర్మ, అదా శర్మ, వర్ష బొల్లమ్మలు ప్రధాన పాత్రల్లో నటించారు. కానీ, దీనిపై ఇంతవరకు స్పష్టత లేదు. అధికారిక ప్రకటన విలువడాల్సి ఉంది.