ఎన్ని వందల కోట్లైనా పర్లేదు.. ప్రభాస్‌తో మైత్రీ మూవీస్!

Mythri Movies with Prabhas In 2022 or 2023

ప్రస్తుతం టాలీవుడ్‌లో నెంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్ ఏది అని ఎవ్వరిని అడిగిన ఒకే ఒక్క పేరు చెబుతారు అదే మైత్రీ మూవీస్. నవీన్ యెర్నేని, రవి శంకర్, చెర్రీ ఇలా అందరూ కలిసి మైత్రీని ఈ స్థాయికి తీసుకొచ్చారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితోనూ సినిమాలు తీసి, ఇంకా తీస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఇప్పటికే మంచి ప్లానింగ్‌తో దూసుకుపోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా ఉప్పెన ప్రమోషన్స్‌లో భాగంగా మైత్రీ మూవీస్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ఫ్యూచర్ ప్రాజెక్ట్‌ల గురించి చెప్పుకొచ్చారు.

Mythri Movies with Prabhas In 2022 or 2023
Mythri Movies with Prabhas In 2022 or 2023

ఇప్పటికే కొన్ని అద్భుతమైన ప్రాజెక్ట్‌లు ప్రకటించేశారు. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్, చిరంజీవి బాబీ వంటి భారీ ప్రాజెక్ట్‌లు రాబోతోన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ పుష్ప రెడీ అవుతోంది. అయితే తమ భవిష్యత్ ప్రాజెక్ట్‌ల గురించి చెబుతూ ప్రభాస్‌తో చేయబోతోన్న చిత్రం గురించి ఓ క్లూ ఇచ్చారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు దర్శకులతో కథలు చెప్పిస్తున్నామని మైత్రీ వారు తెలిపారు. అయితే ప్రభాస్‌ది పాన్ ఇండియన్ లెవెల్ కదా అని ప్రశ్నిస్తే దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు.

ప్రభాస్ లెవెల్‌కు కనీసం ఐదు వందల కోట్ల బడ్జెట్ అయినా ఉండొచ్చు కదా? అని ప్రశ్నిస్తే.. అవున కచ్చితంగా.. ఆయనతో సినిమా అంటే అలానే ఉంటుంది.. ఆయన పాన్ ఇండియన్ స్టార్.. ఆయనతో తీసే సినిమా మాత్రం భారీ స్థాయిలో ఉంటుందని, ఎన్ని వందల కోట్లైనా పర్లేదన్నట్టుగా హింట్ ఇచ్చేశారు. అంటే మైత్రి వారు ప్యాన్ ఇండియన్ ప్రొడక్షన్ హౌస్‌గా ఎదిగేందుకు సమయం దగ్గర్లోనే ఉంది. అయితే ప్రభాస్‌తో సినిమా 2022, 2023లో ఉండొచ్చని చెప్పుకొచ్చారు.