Sruthi Hassan: స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరియర్ మొదట్లోనే ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఇండస్ట్రీకి ఐరన్ లెగ్ అంటూ శృతిహాసన్ ను అవమానించగా…ఆ అవమానాలనే నిచ్చెనగా చేసుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే దక్షిణాది ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో నటించే సినిమా అవకాశాలు దక్కించుకొని తనను విమర్శించిన వారి చేతనే ప్రస్తుతం ప్రశంశలు పొందుతున్నారు. ఈ క్రమంలోనే శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే శృతిహాసన్ తన ప్రియుడు శంతను హజారికాతో కలిసి ఈమె చేసే రచ్చ సోషల్ మీడియాలో మామూలుగా ఉండదు నిత్యం తన ప్రియుడితో కలిసి వెకేషన్ వెల్లడం వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరి గురించి ఎన్నో వార్తలు వస్తున్నప్పటికీ శృతిహాసన్ ఈ వార్తలపై ఎప్పుడూ స్పందించలేదు. ఈ క్రమంలోనే తన ప్రియుడు ఈ వార్తలపై స్పందిస్తూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను శృతి హాసన్ నుంచి ఎంతో ప్రేరణ పొందానని ఆమె కూడా తన నుంచి ఎంతో ప్రేరణ పొందుతుందని తెలిపారు.తనతో గడిపే ప్రతి క్షణం నాకు ఎంతో మధురమైన జ్ఞాపకంగా ఉంటుంది ఎప్పుడు బోర్ కొట్టదు అది మా ఇద్దరి మధ్య ఉన్న బలమైన బంధం అంటూ చెప్పుకొచ్చారు. ఇక మా పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అని ఎదురు చూస్తున్నాం అని ఆయన వెల్లడించారు.అయితే మా ఇద్దరి మధ్య క్రియేటివ్ మ్యారేజ్ అయితే ఎప్పుడు జరిగిపోయిందని ఈ సందర్భంగా శంతను తెలియజేయడంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి అప్పుడే శృతిహాసన్ కు పెళ్లి అయిపోయిందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.