నా ఫోటోలను మార్ఫింగ్ చేశారు.. విచారణలో రణవీర్ షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్లో ఎన్నో గొప్ప సినిమాలలో నటించిన రణవీర్ సింగ్ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. అయితే కొంతకాలంగా రణవీర్ న్యూడ్ ఫోటోల విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఫోటోలో విషయంలో కేసు కూడా నమోదు అయ్యింది. కొంతకాలం క్రితం ఒక మ్యాగజైన్ కోసం న్యూడ్ ఫోటోషూట్ కోసం ఒంటి మీద నూలు పోగు లేకుండా ఫోటోషూట్ చేయించుకున్నాడు.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలోకి రావటంతో రణవీర్ మీద విమర్శల వెల్లువ మొదలైంది. అంతే కాకుండా వేల మంది ముందు బట్టలు లేకుండా రాగలనని, తనను ఎవరు ఎంత తిట్టినా పట్టించుకోనని రణ్‌వీర్ చేసిన వ్యాఖ్యల వల్ల ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ముంబైలోని చెంబూరు పోలీస్ స్టేషన్ లో రణవీర్ సింగ్ మీద కేసు కూడ నమోదు అయ్యింది. చాలాకాలంగా రణవీర్ సింగ్ ఈ కేసు విషయంలో పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నాడు. ఇక తాజాగా కూడా ఈ కేసు విషయంలో పోలీసులు రణవీర్ ని విచారణ చేశారు.

అయితే ఈ విచారణలో రణవీర్ సింగ్ ఆసక్తికర సమాధానాలు చెప్పడంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. పోలీసుల విచారణలో భాగంగా తన వేరు ఆ న్యూడ్ ఫోటోలు తనది కాదని..తాను ఎలాంటి న్యూడ్ ఫోటో షూట్ చేయలేదని చెప్పాడు. అంతే కాకుండా ఎవరో కావాలనే తన ఫొటోలను మార్ఫింగ్ చేసి అల న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారని రణవీర్ సింగ్ సమధానం చెప్పాడు. రణవీర్ చెప్పిన సమాధానం విని షాక్ అవటం పోలిసుల వంతు అయ్యింది.