Malashri: ఒకప్పుడు హీరోయిన్ పాత్రలు చేయాలన్నా, పోలీస్ క్యారెక్టర్‌లో లీనమై దుమ్ము దులపాలన్నా అది కేవలం మాలాశ్రీకే చెల్లిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కొంత మంది స్టార్ హీరోస్, స్టార్ హీరోయిన్స్ కెరీర్ అంతా బాగుంది, ఇక తిరుగులేదు అని అనుకున్న సమయంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరం కావడం చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్లలో ఒకరు మాలాశ్రీ. కొంత మంది నిర్మాతలు కావాలని మరీ ఈమెతో గ్లామర్ పాత్రలు చేసే సినిమాలను తీయడానికి ఆసక్తి చూపేవారట. అయితే ఈమె కూడా ఇండస్ట్రీని ఏలుతుంది అని అనుకున్న సమయంలోనే సినిమాలకు దూరమై అభిమానులను నిరాశపరిచింది.
కాగా వివాహం చేసుకుని భర్తతో హ్యాపీగా జీవితం సాగుతోంది అని అనుకుండడంగా ఇటీవలే ఆయన మరణించడం ఆమెను అన్ని విధాలా కుంగదీసిందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. అయితే అసలు ఏమైంది ? ఎందుకు అతను చనిపోయాడు ? అనే ప్రశ్నలపై తాజాగా మాలాశ్రీ పెదవి విప్పారు. అదంతా కేవలం ఐదు రోజుల్లోనే జరిగిపోయిందన్న ఆమె, ఆయనకు ఎప్పుడు ఆరోగ్యం బాలేకపోయినా అస్సలు చెప్పకపోయేవారని, అలా ఒకరోజు కూడా ఆయన అలా ఉన్నా, ఆరోగ్యం ఏ మాత్రం సహకరించకపోవడంతో ఫ్యామిలీ డాక్టర్‌ను పిలమని చెప్పారని ఆమె చెప్పుకొచ్చారు. అప్పుడు కొవిడ్ చాలా ఉద్దృతంగా వ్యాపిస్తోందన్న ఆమె, తన భర్తకు కొవిడ్ టెస్ట్ చేయించగా పాజిటివ్ అని తేలిందని ఆమె అన్నారు.
అయితే తన భర్తకు ఆసుపత్రి అంటే అస్సలు పడేది కాదన్న మాలాశ్రీ, డాక్టర్ సలహా మేరకు ఆస్పత్రిలో చేర్పించామని ఆమె చెప్పారు. అప్పటికే ఆయనకు దగ్గు తీవ్రంగా ఉండడం, ఆక్సిజన్ లెవల్స్ కూడా పడిపోవడంతో ఐసీయూలో చేర్చారని ఆమె తెలిపారు. అది జరిగిన రెండో రోజునే ఆయన మరణించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజుకు ముందు రోజు తనకు ఆయన కాల్ చేసి, పక్కన ఒకరు, ముందు బెడ్‌పై ఒకరు చనిపోయారని, తాను అక్కడ ఉండలేనని, వెంటనే తనను డిశ్చార్జి చేయమని చెప్పవా అని అన్నట్టు ఆమె కంటతడి పెట్టారు. భయం వద్దు, ఆ జబ్బుతో పోరాడు. డాక్టర్లు చెప్పినట్టు విను. నువ్వు ఇంటికి రావాలని తాను చెప్పినట్టు మాలాశ్రీ వివరించారు. అయితే చాలా మంది కూడా కరోనా వస్తుంది లేదా వచ్చింది అనే దానికంటే దాని వల్ల వచ్చే భయం వల్లే చాలా మంది చనిపోయినట్టు ఈ సంఘటన ద్వారా మరోసారి తెలుస్తోంది.