నా హార్ట్ బ్రేక్ అయ్యింది.. పూజా హెగ్డే వైరల్ కామెంట్స్!

Pooja Hegde: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. అయితేపూజా హెగ్డే నటించిన వరుస 3 చిత్రాలు ఫ్లాప్ అయినప్పటికీ ఈమెకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి.అవకాశాలతో దూసుకుపోతున్న పూజా హెగ్డే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఇక వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా పూజా హెగ్డే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పూజా హెగ్డే తన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. నాకు 12 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు హృతిక్ రోషన్ నటించిన కోయి మిల్ గయా టైం లో ఆయనతో ఒక్క ఫోటో అయినా దిగడం కోసం ఎంతో తాపత్రయపడ్డాను. ఈ క్రమంలోనే హృతిక్ రోషన్ తో ఫోటో దిగడం కోసం ప్రీమియర్ షో కి వెళ్ళాను. ఫోటో కోసం తాను ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే హృతిక్ రోషన్ మాత్రం స్టేజి దిగి వెళ్లిపోయారు.

ఈ విధంగా ఆ రోజు తన ఫేవరెట్ హీరో హృతిక్ రోషన్ తో ఫోటో దిగడం కుదరకపోవడంతో నా హార్ట్ బ్రేక్ అయింది అంటూ పూజాహెగ్డే చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటన జరిగిన పదేళ్ల తర్వాత ఆయనతో కలిసి మొహంజదారో లోహృతిక్ రోషన్ తో కలిసి నటించే అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా పూజా హెగ్డే తన చిన్నప్పటి జ్ఞాపకాల గురించి తన ఫేవరెట్ హీరో గురించి బయట పెట్టారు.