ఆ టాలీవుడ్ హీరోతో నటించాలనేదే నా డ్రీమ్.. జాన్వీ కపూర్!

జాన్వీ కపూర్ శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె పలు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా పలు సినిమాలలో నటిస్తూ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైంది.తన తల్లి మాదిరిగా ఈమె కూడా పలు భాష చిత్రాలలో నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.అయితే ఈమె సౌత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలు గురించి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన లేదు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ హీరోతో నటించాలని ఉందని, ఆ హీరోతో నటించడమే తన డ్రీమ్ అని చెప్పుకొచ్చారు.మరి ఈ ముద్దుగుమ్మకు ఏ హీరోతో నటించాలని ఉందనే విషయానికి వస్తే తనకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించాలని కోరిక ఉందని ఈమె తెలియజేయడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఎన్టీఆర్ సరసన నటించాలని ఉందని చెప్పడంతో ఎన్టీఆర్ అభిమానుల సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా తెలుగు ప్రేక్షకులు సైతం త్వరలోనే శ్రీదేవి వారసురాలిని తెలుగు సినిమాలలో కూడా చూడవచ్చు అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈమెకు ఎన్టీఆర్ సరసన నటించాలని ఉందని చెప్పడంతో త్వరలోనే ఈమె సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారని దానికి ఎంతో సమయం కూడా లేదని తెలుస్తుంది. ఏదిఏమైనా ఈమె ఇప్పుడు కాకపోయినా మరికొద్ది రోజులలో అయినా సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ గురించి జాన్వి కపూర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.