బిగ్ బాస్ వల్లే కెరియర్ నాశనం అయింది.. వైరల్ అవుతున్న తేజస్వి మదివాడ కామెంట్స్!

బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొనాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. అయితే బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన కంటెస్టెంట్ అభిప్రాయం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటుంది. ఈ షోలో అడుగుపెట్టి దుమ్మురేపిన వారు తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ లే కాదు విన్నర్స్ సైతం ఇదే మాట చెప్తున్నారు. బిగ్ బాస్ కి వెళ్ళకముందు ఉన్న కెరియర్ బిగ్ బాస్ తర్వాత వాళ్ళకి లేకుండా పోయింది అంటున్నారు.

ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన ఒక నటి తన కెరియర్ బిగ్ బాస్ వల్లే నాశనమైందంటూ ఇచ్చిన స్టేట్మెంట్ మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ నటి ఎవరంటే మన అచ్చ తెలుగు ఆడపడుచు తేజస్వి మదివాడ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకిక్కెన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఆర్జీవి దర్శకత్వంలో వచ్చిన ఐస్క్రీం సినిమాలో మొదటిసారి హీరోయిన్ గా చేసింది.

ప్రస్తుతం ఆమె ఆహా ఓటీటీ లో కాకమ్మ కబుర్లు అనే ఒక షో కి హోస్ట్ గా వ్యవహరిస్తుంది. అయితే ఈమధ్య తేజస్వి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్ బాస్ రియాల్టీ షో పై షాకింగ్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ సీజన్ 2 లో తనపై ప్రోపగండా ప్రకారమే తమ క్యారెక్టర్ ను బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన పేరు పాడవ్వటానికి బిగ్ బాస్ సీజన్ 2 కారణమని చెప్పుకొచ్చింది.

ఒకసారి జనాలలోకి బాడ్ ఇంప్రెషన్ వచ్చాక దాన్ని మార్చడం అసాధ్యమని జనాలు ఎలా ఆలోచిస్తే అలాగే ఆలోచించనివ్వండి నేను మాత్రం నాలాగే ఉంటాను అని చెప్పుకొచ్చిన తేజస్వి బిగ్ బాస్ లోకి సిగ్గు ఉన్నవాడు ఎవడు మళ్ళీ వెళ్ళడు నేను కూడా వెళ్ళను అని చెప్పింది. నేను చూడటానికి రిచ్ కిడ్ లా కనిపిస్తాను కాని నాకు కూడా ఆర్థిక సమస్యలు ఉన్నాయి నేను డబ్బు కోసమే టీవీలలో ఎక్కువగా కనిపిస్తాను అని చెప్పుకొచ్చింది ఈ తెలుగు పిల్ల.