అలనాటి ప్రముఖ నటుడు మురళీమోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో కీలకపాత్రలలో నటించిన మురళి మోహన్ దాదాపు 350 సినిమాలలో నటించాడు. అంతే కాకుండా మురళి మోహన్ రాజకీయాలలో కూడా రాణించాడు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళి మోహన్ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న మురళీమోహన్ ఆ సినిమా విశేషాల గురించి కూడా వివరించాడు.
ఇక మురళీమోహన్ నాగచైతన్య గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో పల ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. గతంలో తమ కోసం కట్టుకున్న అపార్ట్మెంట్ నాగచైతన్యకి బాగా నచ్చి తనకి కావాలని కోరాడు. కానీ అవి ఇవ్వటానికి కాదు అని మురళీమోహన్ చెప్పాడు. అయితే నాగార్జున గారు తర్వాత మురళి మోహన్ కి ఫోన్ చేసి ఆ అపార్ట్మెంట్ నాగచైతన్యకు బాగా నచ్చిందని తనకి అది కావాలని ఆశ పడుతున్నాడని చెప్పగా ఆ అపార్ట్మెంట్ నాగచైతన్యకి ఇవ్వటానికి మురళీమోహన్ అంగీకరించాడని చెప్పుకొచ్చాడు. సమంత నాగచైతన్య వివాహం జరిగిన తర్వాత కూడా వారిద్దరు ఆ అపార్ట్మెంట్లో ఉండేవారని ఈ సందర్భంగా ఆయన వెల్లడించాడు.
అయితే ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఉదయాన్నే లేచి జిమ్ చేసేవారు. ఇద్దరు చాలా సరదాగ గడుపుతూ అప్పుడప్పుడు పార్టీలు కూడా పెట్టేవారు. అయితే ఎప్పుడూ వారి మద్య గొడవ జరిగే శబ్ధం కూడా వినిపించేది కాదు. అలాంటి వాళ్ళు విడిపోతున్నారు అని మా పనిమనిషి వచ్చి చెబితే తెలిసిందే. వీరి విడాకుల విషయం విని నేను చాలా షాక్ అయ్యాను. అప్పటికే నాగ చైతన్య ఇంట్లో కాకుండా బయట వేరే హోటల్ లో ఉండేవాడు. అప్పటికే వాళ్ళు నిర్ణయం కూడా తీసేసుకున్నారు. అయితే వారు ఎందుకు విడిపోయారు అనేది నాకు తెలీదు అంటూ మురళి మోహన్ వెల్లడించారు.