గోవా తీసుకెళ్లి న‌న్ను8 రోజులు వాడుకుంది.. ముమైత్ ఖాన్‌ మోసంపై డ్రైవర్ కామెంట్స్

Mumaith Khan Cheated a Cab Driver

ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ టాలీవుడ్ ఓ ఊపే ఊపేసింది ముమైత్ ఖాన్. ఓ ఐటం సాంగ్‌లు చేసే అమ్మాయికి ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుందని, వస్తుందని ఎవ్వరూ కూడా ఊహించరు. సినిమాల్లో స్పెషల్ సాంగ్‌లు చేసుకునే ముమైత్ ఖాన్.. కొన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించింది. అయితే హీరోయిన్‌గా అంతగా సక్సెస్ కాలేకపోయింది. బిగ్‌బాస్ మొదటి సీజన్‌లో పాల్గొన్నా గానీ అంతగా పేరు తెచ్చుకోలేకపోయింది.

Mumaith Khan Cheated a Cab Driver
Mumaith Khan Cheated a Cab Driver

తాజాగా ముమైత్ ఖాన్ వార్తల్లో నిలిచింది. తనను ఘోరంగా మోసం చేసిందని ఓ క్యాబ్ డ్రైవర్ మీడియా ముందు వాపోయాడు. తనలా మరొకరు అన్యాయానికి గురి కాకూడని మీడియా ముందుకు వచ్చానని తెలిపాడు. అసలు ఏం జరిగిందంటే. రీసెంట్‌గా హైదరాబాద్‌కు చెందిన రాజు అనే క్యాబ్ డ్రైవర్ ముమైత్ ఖాన్ మోసం చేసిందని ఆరోపణలు చేశాడు. 8 రోజుల వరకు ట్రిప్ కి తీసుకెళ్లి డబ్బులు ఇవ్వకుండా చీట్ చేసిందని చెబుతున్నాడు.

ముందుగా ఈ విషయాన్ని క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ కు పిర్యాదు చేసినట్లు చెబుతూ చర్చల అనంతరం పోలీస్ స్టేషన్‌కి వెళతానని తెలిపాడు.మూడు రోజుల వరకు గోవా ట్రిప్ కోసం కారును బుక్ చేసుకున్న ముమైత్ ఖాన్ ఆ తరువాత 8 రోజుల వరకు కారును వదలలేదని గోవా మొత్తం తిరిగినట్లు రాజు ఆరోపించారు. అయితే ఈ ప్రయాణంలో ఆమె కనీసం టోల్ గేట్ డబ్బులు కూడా ఇవ్వలేదని మొత్తంగా రూ.15వేల వరకు చెల్లించాలని రాజు చెబుతున్నాడు. మరి వీటిపై ముమైత్ ఖాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.