మరో కొత్త లుక్ లో ప్రభాస్ రాకకై రంగం సిద్ధం..!

ప్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా ఇపుడు పలు విభిన్నమైన చిత్రాలు చేస్తూ అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. పోస్ట్ బాహుబలి సిరీస్ తన నుంచి వచ్చిన చిత్రాల్లో దేనికి కూడా ఒకదానితో ఇంకొకటి సంబంధం లేదు. అలా ఇప్పుడు తన నుంచి ఈ ఏడాదిలోనే బహుశా రెండు సినిమాలు వచ్చేసే ఛాన్స్ ఉంది.

కాగా ఈ చిత్రాల్లో మొదటిగా భారీ చిత్రం కల్కి ని మే 9న విడుదల చేస్తున్నట్టుగా ఫిక్స్ చేసారు. ఇక ఈ సినిమాతో పాటుగా కేవలం ఫ్యాన్స్ కోసం అన్నట్టుగా చేస్తున్న ఇంకో చిత్రం కూడా ఉంది. ఆ సినిమానే దర్శకుడు మారుతీతో చేస్తున్న సినిమా. కాగా ఈ సినిమాపై లిమిటెడ్ గానే అంచనాలు ఉన్నప్పటికీ..

మెయిన్ గా ప్రభాస్ ఫాన్స్ కి బాగా నచ్చే విధంగా సినిమాని చేసే యత్నం చేస్తున్నారు. ఇక ఇది ఒక హారర్ థ్రిల్లర్ కాగా ఈ సినిమా నుంచి ఇది వరకే చిత్ర బృందం సినిమా టైటిల్ సహా సినిమాలో ప్రభాస్ సరికొత్త ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని తెలిపారు. ఫైనల్ గా ఇప్పుడు దీనికి డేట్ అండ్ టైం అనౌన్స్ చేసేసారు.

దీనితో ఈ జనవరి 15న ఉదయం 7 గంటల 8 నిమిషాలకి విడుదల చేస్తున్నట్టుగా ముహూర్తం ఫిక్స్ చేసారు. దీనితో పండుగ పూట ప్రభాస్ ఫ్యాన్స్ కి ఉదయాన్నే మరో పండుగ అని చెప్పాలి. కాగా ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడని రూమర్స్ ఉన్నాయి.