ఇది క్లియర్.! మృనాల్ ఠాకూర్ హయ్యస్ట్ పెయిడ్ యాక్ట్రెస్.!?

ఔనా.? మృనాల్ ఠాకూర్‌కి హయ్యస్ట్ రెమ్యునరేషన్ ‘పే’ చేస్తున్నారా.? తెలుగు సినీ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్.! ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’.. ఈ రెండే రిలీజ్‌లు ఇప్పటిదాకా మృనాల్ ఠాకూర్ నుంచి సక్సెస్ రేట్ 100 పర్సెంట్.! మొదటిది సంచలన విజయం. రెండోది కూడా హిట్టే.!

సినిమాల హిట్ రేంజ్ సంగతి పక్కన పెడితే, సినిమా సినిమాకీ మృనాల్ ఠాకూర్ రేంజ్ పెరిగిపోతోంది. బాలీవుడ్ ప్రాజెక్టులతో రష్మిక మండన్న బిజీ అయిపోవడం, కృతి శెట్టి లాంటోళ్ళు వచ్చినట్టే వచ్చి, ఫ్లాపులతో డల్ అయిపోవడం.. ఇవన్నీ మృనాల్ ఠాకూర్‌కి బాగా కలిసొచ్చాయ్.

సీనియర్ హీరోలైనా, యంగ్ హీరోలైనా.. మృనాల్ ఠాకూర్ ఇప్పుడు ఫస్ట్ ఛాయిస్ అవుతోంది టాలీవుడ్‌లో. అయితే, మృనాల్ ఏమీ, ఎడా పెడా సినిమాలు ఒప్పేసుకోవడంలేదు. ఆచి తూచి వ్యవహరిస్తోంది. దాంతో, ఆమెకు డిమాండ్ కూడా అంతే స్థాయిలో పెరిగిపోతోంది.

‘అబ్బే, నేనేమీ అంత గట్టిగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయట్లేదండీ. నిర్మాతలే ఆలోచించుకుంటారు నాకెంత ఇవ్వాలనేది.?’ అని చెబుతోంది మృనాల్ ఠాకూర్. నిర్మాతలకి ఫస్ట్ ఛాయిస్ మృనాల్ ఠాకూర్ అవడంతో, రెమ్యునరేషన్ కూడా అలాగే ఆఫర్ చేస్తున్నారు.

మృనాల్ ఠాకూర్ నుంచి విడుదలకు సిద్ధమవుతోన్న తాజా సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ కాగా, లేటెస్ట్‌గా కమిట్ అయిన ప్రాజెక్ట్ ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న సినిమా. సో, హయ్యస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ మృనాల్.. అన్న మాటకి జస్టిఫికేషన్ లభించేసినట్టే.!