డిమాండ్‌లో ఉన్న నటి మృణాల్‌ ఠాకూర్‌!

ప్రస్తుతం మృణాళ్‌ఠాకూర్‌ టైమ్‌ నడుస్తున్నది. సీతారామం, హాయ్‌ నాన్న విజయాలతో మంచి దూకుడు విూద ఉన్నది ఈ అందాలభామ. ఈ మహారాష్ట్ర అందానికి మరో అద్భుతమైన అవకాశం వరించిందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. త్వరలో ప్రభాస్‌కి జోడీగా కనిపించనున్నదట మృణాళ్‌ఠాకూర్‌.

వివరాల్లోకెళ్తే.. ప్రభాస్‌ కథానాయకుడిగా దర్శకుడు హను రాఘవపూడి త్వరలో ఓ పీరియాడికల్‌ డ్రామా తెరకెక్కించనున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్‌ వర్క్‌ కూడా ఇప్పటికే మొదలైంది. ఈ సినిమాలో కథానాయికగా మృణాల్‌ని ఎంపిక చేశారన్న వార్త సాంఘిక మాధ్యమాల్లో బాగా వైరల్‌ అవుతున్నది. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. అదే నిజమైతే మృణాళ్‌ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే. ప్రస్తుతం మృణాళ్‌ ‘ఫ్యామిలీస్టార్‌’లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.