వరుస అవకాశాలు రావడంతో ఓవర్ చేస్తున్న శ్రీ లీల… తగ్గించుకుంటే మంచిదంటూ వార్నింగ్ ఇచ్చిన హీరో?

శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా కన్నడ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా పెళ్లి సందడి సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ శ్రీ లీల నటనకు ఆమె అందచందాలకు దర్శక నిర్మాతలు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు.ఈ క్రమంలోనే ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ శ్రీలలాకు మాత్రం వరస సినిమా అవకాశాలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అవకాశాలను అందుకొని బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం చేతిలో సుమారు అరడజనుకు పైగా సినిమా అవకాశాలను పెట్టుకుని వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా వరుస సినిమా అవకాశాలు రావడంతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమెకు మరొక భారీ నిర్మాణ సంస్థ నుంచి మంచి అవకాశం వచ్చిందట.ఈ క్రమంలోనే ఆమె ఈ సినిమాకు ఓకే చెప్పడానికి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఇదివరకే కమిట్ అయిన సినిమా నుంచి తప్పుకోవడానికి ప్రయత్నం చేశారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అనే డైరెక్టర్ కి తెలియజేశారట.

ఈ విధంగా శ్రీ లీల ఇదే విషయాన్ని డైరెక్టర్ కి చెప్పడంతో డైరెక్టర్ ఈ విషయం హీరోకి చేరవేశారు.ఇలా సినిమా నుంచి తప్పుకోవాలని ఆలోచన రావడంతో ఆ హీరో సరాసరి ఆమె వద్దకు వెళ్లి స్ట్రైట్ గా తనకు వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.ఇండస్ట్రీలో అవకాశాలను అందుకొని ముందుకు వెళ్లాలంటే ఇక్కడ ముందు పద్ధతిగా నడుచుకోవడం తెలుసుకోవాలి, మాట మీద నిలబడే తత్వం ఉండాలి అంటూ తనదైన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. మరి ఈమెకు వార్నింగ్ ఇచ్చిన ఆ హీరో ఎవరు అనే విషయం గురించి ప్రస్తుతం చర్చలు మొదలయ్యాయి.