కెసిఆర్‌ పేరుతో సినిమా

కేసీఆర్‌’ పేరుతో ఇప్పుడొక సినిమా రాబోతోంది. గ్రీన్‌ టీ ప్రొడక్షన్స్‌ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్‌ పతాకంపై ’జబర్‌దస్త్‌’ షో తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్‌ రాకేష్‌ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు.

’గరుడవేగ’ వంటి ఎన్నో చిత్రాలకు డీవోపీగా పని చేసిన అంజి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్‌ లుక్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. తెలంగాణ ప్రాంతం బంజారా తాండ నేపధ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ’కేసీఆర్‌’ అంటే..కేశవ్‌ చంద్ర రమావత్‌ అనే పవర్‌ ఫుల్‌ టైటిల్‌ లాక్‌ చేశారు.

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేతులు విూదగా మల్లారెడ్డి యూనివర్సిటీలో 50 అడుగుల కటౌట్‌తో 50,000 మంది స్టూడెంట్స్‌ సమక్షంలో టైటిల్‌ లాంచ్‌ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణతో పాటు చిత్ర బృందం హాజరయ్యారు.