బుల్లితెర నటిగా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి హిమజా గురించి అందరికీ సుపరిచితమే. బిగ్ బాస్ తర్వాత వరుస షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు, పలు సినిమాలలోను అలాగే టీవీ షోలలో సందడి చేస్తూ తన కెరియర్ లో బిజీ అవుతున్నారు. ఇకపోతే హిమజ సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తూ బిజీగా ఉండి పోయారు. ఇలా కెరీయర్ లో ఎంతో బిజీగా ఉన్న హిమజా పెళ్లి గురించి గతంలో వార్తలు వచ్చాయి.
ఈమె రహస్యంగా పెళ్లి చేసుకుందని తన భర్తకు విడాకులు కూడా ఇవ్వబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఈ వార్తలపై హిమజ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇకపోతే తాజాగా మదర్స్ డే సందర్భంగా బుల్లితెరపై అమ్మకు ప్రేమతో అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు బుల్లితెర నటులు వారి అమ్మలను వేదికపైకి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ మదర్స్ డే సందర్భంగా వారి అమ్మలకు కానుకలు అందజేశారు. ఇక హిమజా కూడా తన తల్లికి గిఫ్ట్ ఇవ్వబోగా తన తల్లి గిఫ్ట్ తీసుకోనని చెప్పేశారు.
హిమజ తల్లి గిఫ్ట్ ఎందుకు తీసుకోనని చెప్పారు అనే విషయానికి వస్తే..తను నాకు ఒక ప్రామిస్ చేస్తేనే నేను గిఫ్ట్ తీసుకుంటానని చెప్పారు. అయితే ప్రామిస్ ఏంటి అనే విషయానికి వస్తే తనకు ఒక తోడు కావాలి కదా పెళ్లి చేసుకుంటానని చెబితేనే గిఫ్ట్ తీసుకుంటానని చెప్పారు. ఈ మాటకు హిమజా తనకు కొంచెం సమయం కావాలి అని తన తల్లిని అడిగారు. ఈ విధంగా హిమజా సమయం కావాలి అని చెప్పడంతో చివరికి తన తల్లి గిఫ్ట్ తీసుకున్నారు.మొత్తానికి హిమజా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదని తన తల్లి ఈ సందర్భంగా తన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.