ఉన్ని ముకుందన్ కథానాయకుడిగా హనీఫ్ దర్శకత్వంలో రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ మార్కో. 30 కోట్ల బడ్జెట్ తో మలయాళంలో నిర్మితమైన ఈ సినిమా వారం రోజులలోనే కేరళలో 80 కోట్లకు పైగా వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధమైంది. వైలెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగులో జనవరి 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో ఉన్ని ముకుందన్ అద్భుతంగా నటించారు.
ముఖ్యంగా సినిమా హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలలో ఆకట్టుకున్నాడు.అద్భుతమైన సినీమాటోగ్రఫీ పవర్ఫుల్ మ్యూజిక్ మొత్తం టెక్నికల్ కు సంపూర్ణమైన ప్రశంసలు వచ్చాయి. ఈయన మన తెలుగులో కూడా జనతా గ్యారేజ్, భాగమతి, యశోద వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ మార్కో ఇంటెన్స్ బ్లడ్ షెడ్ వరల్డ్ లోకి ఒక గ్లింప్స్ గా హీరో యాక్షన్ ప్యాక్డ్ జర్నీ ని హైలెట్ చేస్తుంది.
ఫుల్ లెన్త్ అండ్ మోస్ట్ వయోలెంట్ మూవీగా పేరు తెచ్చుకున్న మార్కో తెలుగు ట్రైలర్ కూడా అదిరిపోయింది. ట్రైలర్లో మార్కో రక్తపాతాన్ని చూడవచ్చు. ఇక ఈ సినిమాలో సిద్ధిక్, జగదీష్,అభిమన్యు, ఎస్ తిలకన్, కబీర్ దుహన్ సింగ్, అన్సన్ పాల్, యుక్తి థరేజా కీలక పాత్రలు పోషిస్తున్నారు. చంద్రు సెల్వరాజ్ స్టైలిష్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రాన్ని విజువల్ ఫీస్ట్ గా మార్చింది. సమీర్ మహమ్మద్ ఎడిటింగ్ కథని వేగంగా సాగేలా చేసింది.
మైకేల్ ది గ్రేట్ ఫాదర్ సినిమాల ఫేమ్ హనీఫ్ ఆదోని ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై షరీఫ్ మహమ్మద్ నిర్మించారు. తన సోదరుడు, అతని ఫ్రెండ్ ని చంపిన వాళ్లపై రివెంజ్ తీర్చుకుంటాడు మార్కో. ఈ క్రమంలో తన ఫ్యామిలీకి ఏం జరిగింది? మార్కో ఎలా రియాక్ట్ అయ్యాడు ఎలాంటి రక్తపాతం సృష్టించాడు అనేది సినిమా కథ. మరి ఈ సినిమా తెలుగులో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.