ప్రభాస్ సినిమా..లీకులే లీకులు..!

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ వాంటెడ్ గా బిగ్గెస్ట్ స్టార్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరి ప్రభాస్ హీరోగా ఇపుడు పలు భారీ చిత్రాల్లో రిలీజ్ కి ఆల్రెడీ ఓ సినిమా రాబోతుండగా మరికొన్ని చిత్రాలు షూటింగ్ లో ఫుల్ బిజీగా అయితే ఉన్నాయి. ఇక ఈ చిత్రాల్లో లేటెస్ట్ గా ఊహించని విధంగా పాన్ వరల్డ్ చిత్రం “కల్కి 2898ఎడి” నుంచి ఏకంగా వీడియో ఫుటేజ్ లీక్ అయిపోవడం సినీ వర్గాల్లో వైరల్ గా మారిపోయింది.

హీరోయిన్ దీపికా పదుకొనె పై షూట్ లో ఓ సీక్వెన్స్ ఏదో వీడియో బయటకి వచ్చేసింది. దీనితో ఈ వీడియో చూసి అంతా ఒకసారిగా షాకయ్యారు. అయితే వెంటనే మేకర్స్ అప్రమత్తమయ్యి డిలీట్ చేయించి మళ్ళీ హెచ్చరికలు ఇచ్చారు. అయితే ఇది ప్రభాస్  కొత్తేమి కాదు ఇప్పటికే ఓ లుక్ ప్రభాస్ పై లీక్ అయ్యింది. ఇవే కాకుండా ప్రభాస్ గత చిత్రాలు సలార్ మారుతీ ప్రాజెక్ట్ పై కూడా లీకులు రావడం అనేది వైరల్ గా మారింది.

దీనితో ప్రభాస్ సినిమాల నుంచే ఇలా వరుస లీకులు వస్తుండడం గమనార్హం. మరి ఈ లీకులు అన్నీ కావాలనే అవుతున్నాయా లేక యాదృచ్చికంగా జరుగుతున్నాయా అనేది ఆ పైవాడికే తెలియాలి. ఇక ఇదిలా ఉండగా ఈ డిసెంబర్ లో అయితే ప్రభాస్ నటిస్తున్న అవైటెడ్ చిత్రం సలార్ గ్రాండ్ గా 22వ తేదీన విడుదల కాబోతుంది.