మోనాల్‌కు క్రేజీ ఆఫ‌ర్.. డ్యాన్స్‌తో ర‌చ్చ చేయ‌నున్న బిగ్ బాస్ ద‌త్త పుత్రిక

అల్ల‌రి న‌రేష్‌తో క‌లిసి ప‌లు సినిమాలు చేసిన మోనాల్ కెరీర్‌లో నాలుగుకు పైగా సినిమాలు చేసింది. వీటిలో ఏ సినిమా కూడా పెద్ద విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో అమ్మ‌డికి ప్ర‌త్యేక గుర్తింపు రాలేదు. క‌రోనా స‌మ‌యంలో మొద‌లైన బిగ్ బాస్ సీజ‌న్‌4లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా అడుగుట‌పెట్టిన మోనాల్ 14 వారాల పాటు ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన వినోదాన్ని అందించింది. చాలా వారాల‌లో ఆమె ఎలిమినేట్ అవుతుంద‌ని ప్ర‌జ‌లు జోస్యాలు చెప్పిన బిగ్ బాస్ ద‌త్త‌పుత్రిక‌గా 14 వారాలు పాటు హౌజ్‌లోనే ఉంది. ఇక బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ అందాల భామ‌కు ఆఫ‌ర్స్ వెల్లువ‌లా కురుస్తున్నాయి.

మోనాల్ ప్ర‌స్తుతం ఓంకార్ హోస్ట్ చేస్తున్న డ్యాన్స్ ప్ల‌స్ అనే షోలో మెంట‌ర్‌గా ఉంది. ఇక కొన్ని షోస్‌కు యాంక‌ర్‌గా సైన్ చేసిన‌ట్టు తెలుస్తుంది. మ‌రోవైపు సినిమాల‌లోను క్రేజీ ఆఫ‌ర్స్ పొందుతున్న‌ట్టు స‌మాచారం. ఫిలింన‌గ‌ర్ టాక్స్ ని బ‌ట్టి చూస్తే గుజరాతీ భామ మోనాల్ గ‌జ్జ‌ర్ తెలుగు చిత్రంలో అవ‌కాశం కొట్టేసింది. టాలీవుడ్ న‌టుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చేస్తున్న అల్లుడు అదుర్స్ లో ఈ అమ్మ‌డు ర‌చ్చ చేయ‌నున్న‌ట్టు టాక్. ఇప్ప‌టికే ఈ చిత్రంలో అను ఎమ్మాన్యుయేల్‌, న‌భాన‌టేశ్ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా..మోనాల్ గ‌జ్జ‌ర్ స్పెష‌ల్ ఎంట్రీతో ఇవ్వనుంద‌ట‌.

స్పెష‌ల్ సాంగ్‌లో బెల్లంకొండ‌, మోనాల్ క‌లిసి డ్యాన్స్ చేయ‌నుండ‌గా, ఈ సాంగ్ కోసం అన్న‌పూర్ణ స్టూడియోలో ఆర్ట్ డైరెక్ట‌ర్ అవినాష్ కొల్ల సార‌థ్యంలో ఈ పాట కోసం ప్ర‌త్యేకంగా సెట్ వేశార‌ట‌. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్రాఫీలో ఈ పాట‌ను చిత్రీక‌రించ‌నున్నారు. స్పెష‌ల్ సాంగ్‌లో మోనాల్ చేసే డ్యాన్స్ సినిమాకు మ‌రింత స్పెష‌ల్ కానుంద‌ని అంటున్నారు. సంతోష్ శ్రీనివాస్ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాని గొర్రెల సుబ్ర‌హ్మ‌ణ్యం నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జ‌న‌వ‌రి 15న‌ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.