ఆ ఒక్క అలవాటుని మార్చుకుంటే అభిజీత్ స్వీట్ పర్సన్ అండ్ Mr.పర్ఫెక్ట్ :మోనాల్

Monal says Abhijeet had ego problem

గత వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన మోనాల్ గజ్జర్ వరుసగా మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ బాగా బిజీ గా ఉంది. ఇటీవల మోనాల్ ఒక వెబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు అభిజిత్ పై ఉన్న అభిమానం ను చెప్పకనే చెప్పింది. నాగార్జున సర్ మొదట్లో నీ మనసులో ఉన్న “ఎ” ఎవరు అంటూ ప్రశ్నించినప్పుడు అభి ఉన్నాడు. ఆ విషయాన్ని నేను చెప్పలేదు. కాని ఆ తర్వాత నేను అభితోనే చెప్పాను. నా మనసులో ఉన్న ఎ నువ్వే అంటూ అభిజిత్ తో చెప్పాను. కాని కొన్ని కారణాల వల్ల ఆయనకు నాతో విభేదాలు వచ్చాయి. అభిజిత్ మరియు అఖిల్ ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్. అభిజిత్ ఆట విషయంలో చాలా ఫోకస్ గా ఉంటాడని మోనాల్ చెప్పింది.

Monal and Abhijeet

తన ప్రతి ఇంటర్వ్యూలో కూడా అభిజిత్ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్న మోనాల్ ఇటీవల ఇంటర్వ్యూలో మరోసారి ఆయన గురించి మాట్లాడింది. అభిజిత్ లాంటి అబ్బాయిల మీద అమ్మాయిలకు ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఆయన నేను చేసేదే రైట్ అంటూ ఈగోగా మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో ఆయన ఇతరుల మాటలకు విలువ ఇవ్వడు. దాంతో అభిజిత్ కొన్ని సార్లు బ్యాడ్ అవుతాడు. ఆ ఈగోను వదిలేస్తే ఆయన చాలా స్వీట్ పర్సన్ అండ్ mr.పర్ఫెక్ట్ అని మోనాల్ చెప్పుకొచ్చింది. అభిజిత్ ఎంతగా మోనాల్ ను దూరం పెట్టాడో తెలిసిందే. అయినా కూడా మోనాల్ మాత్రం ఆయన పట్ల ఇంకా పాజిటివ్ గానే ఉంది. బిగ్ బాస్ నుండి బయటకి వచ్చిన తరువాత అభిజీత్ మోనాల్ ని తప్పక కలుస్తానని మాట ఇచ్చాడు. అప్పుడైనా అభిజీత్ కి మోనాల్ మనుసులో తన మీద అభిమానం అర్ధమయ్యి ఇద్దరూ మంచి స్నేహితులుగా కలిసి ఉండాలని కోరుకుందాం.