హైద‌రాబాద్‌లో శుభ‌కార్యం ప్లాన్ చేస్తున్న మోనాల్.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ర‌చ్చ మాములుగా ఉండ‌ద‌ట‌!

బిగ్ బాస్ సీజన్ 4లో అందాల భామగా బుల్లితెర ప్రేక్షకుల్ని తెగ ఎంటర్ టైన్ చేసింది గుజరాతి భామ మోనాల్ గజ్జర్. సీజన్ ఎండింగ్ వరకు ఎంతో టఫ్ కాంపిటేషన్ ఇచ్చిన మోనాల్ లాస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయ్యింది. అయితే బిగ్ బాస్ తర్వాత క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు గుజరాత్ నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఇల్లు కొంటున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే కొన్నేళ్ళ క్రిందటే సినీ ఇండస్ట్రీకి వచ్చిన మోనాల్ కు అదృష్టం వరించలేదు. కానీ ఇప్పుడు మోనాల్ కి వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇదంతా బిగ్ బాస్ కారణంగానే అంటున్నారు ఆమె అభిమానులు. రీసెంట్ గా అల్లుడు అదుర్స్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో మెస్మరైజ్ చేసింది. సినిమా అవకాశాలతో పాటు టీవీ షోస్, వెబ్ సిరీసుల్లో మోనాల్ కు ఆఫర్స్ వస్తున్నాయి.

ఇక అసలు విషయానికి వ‌స్తే మోనాల్ కు భారీ రెమ్యునరేషన్ ఇవ్వడంతో.. తనకు ప్రేక్షకుల్లో క్రేజ్ ఉండగానే హైప్ క్రియేట్ చేసుకోవాలనుకుంటుంది. అందుకే బాగా ఆలోచించి.. హైదరాబాద్ లో సెటిల్ అవ్వాలని.. లేట్ చేయకుండా ఇల్లు కొనే పనిలో బిజీ ఉంది ఈ హాట్ బ్యూటీ. దీనికి సంబంధించిన పనులు కూడా చకచకా అయిపోతున్నాయట. అతి త్వరలోనే తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ లో గృహ ప్రవేశం చేస్తుందనే వార్తలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

మోనాల్ ఇంటి గృహ ప్రవేశానికి బిగ్ బాస్ ఫ్యామిలీని కూడా పిలిచి పార్టీ ఆఫర్ చేయబోతోందన్నమాట. మోనాల్ తన ఆటపాటలతో బిగ్ బాస్ ఇంటితో పాటు, బుల్లితెర ప్రేక్షకుల్ని మైమరిపించింది. తనలో దాగి ఉన్న టాలెంట్ ని ఇకపై ప్రదర్శిస్తానంటుంది. మోనాల్ ఫ్యూచర్ మరింత బ్రైట్ గా ఉండాలని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.