బిగ్‌బాస్ ద‌త్త‌పుత్రిక‌కు వ‌రించిన అదృష్టం.. అప్పుడే ఓ ప్రోగ్రామ్ ఆఫ‌ర్ కొట్టేసింది!

ఒక్కొక్క‌రికి ఒక్కోలా అదృష్టం వ‌రిస్తూ ఉంటుంది. గుజ‌రాతీ భామ మోనాల్‌కు మాత్రం బిగ్ బాస్ రూపంలో అదృష్టం క‌లిసొచ్చింది. నాలుగు సినిమాల‌లో న‌టించిన మోనాల్ తెలుగు ప్రేక్ష‌కుల దృష్టిని ఏమాత్రం ఆక‌ర్షించ‌లేక‌పోయింది. కాని బిగ్ బాస్ సీజ‌న్ 4లో 14 వారాలు ఉన్న ఈ ముద్దుగుమ్మ త‌న‌కంటూ స్పెష‌ల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌ర‌చుకుంది. బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత మోనాల్‌కు పిచ్చి పిచ్చిగా ఆఫ‌ర్స్ వ‌స్తున్న‌ట్టు టాక్స్ వినిపించిన‌ప్ప‌టికీ, అఫీషియ‌ల్‌గా ఏది ఓకే అయింద‌నే దానిపై క్లారిటీ రాలేదు.

అయితే ఈ రోజు స్టార్ మా డ్యాన్స ప్ల‌స్ అనే కార్య‌క్ర‌మంలో మోనాల్ పాత్ర ఉంద‌ని స్మాల్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చి తెలియ‌జేశారు. ఓంకార్‌కి సంబంధించిన డ్యాన్స్ షోకి సంబంధించి తాజాగా ప్రోమో విడుద‌ల చేయ‌గా, ఇందులో గుజ‌రాతీ బ్యూటీ ఇలా మెరిసి అలా అంద‌రి దృష్టిని త‌న వైపుకు తిప్పుకుంది రెడ్ స్ట‌ర్క్ లో ఎంద అందాల‌ని చూపిస్తూ మోనాల్ మెస్మ‌రైజ్ చేసింది. ఇన్నాళ్లు ఈ కార్య‌క్ర‌మంపై పెద్ద‌గా ఆస‌క్తి చూప‌ని వారు కూడా ఇప్పుడు మోనాల్ కోస‌మైన షో చూడాలనే ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు.

మోనాల్‌కు టీవీ కార్య‌క్ర‌మాలే కాకుండా మంచి సినిమా ఆఫ‌ర్స్ కూడా వ‌స్తున్న‌ట్టు తెలుస్తుంది. హౌజ్‌లో ఉన్న‌న్ని రోజులు అఖిల్ చాటు వెనుక అమ్మాయిలా క‌నిపించిన మోనాల్ ఇప్పుడు త‌న విశ్వ‌రూపం చూపిస్తానంటుంది. అస‌లు మోనాల్ ఎలా ఉంటుందో రానున్న రోజుల‌లో తెలుస్తుంది అని కోతలు కోస్తుంది. చూడాలి మ‌రి మోనాల్ ఇటు షోస్, అటు సినిమాల‌తో ఏ రేంజ్ క్రేజ్ తెచ్చుకుంటుందో..!