మోనాల్ మీదకు భల్లేగా ఎక్కేసింది.. ఆగలేకపోయిన హారిక!

Monal and Harika In Dance plus

బిగ్ బాస్ ఇంట్లో మోనాల్, హారికల మధ్య ఎంత మంచి బంధం ఏర్పడిందో అందరికీ తెలిసిందే. మొదట్లో ఒకరంటే ఒకరికి పడదేమో అన్నట్టుగా కనిపించింది. కానీ చివరకు వచ్చే సరికి ప్రాణమిచ్చుకునే అక్కా చెల్లెళ్లుగా మారిపోయారు. హారిక చివర్లో చాలా తప్పులే చేసింది. అభిజిత్‌తో బాగానే ఉంటూ వచ్చిన హారిక.. చివరి రెండు మూడు వారాల్లో దూరంపెట్టేసింది. అక్కడితో ఆగకుండా అఖిల్, మోనాల్‌తో మరింత క్లోజ్‌గా మారింది.

Monal and Harika In Dance plus

మోనాల్, హారికల మధ్య విడదీయలేని బంధం ఇంత త్వరగా ఎలా మొదలైందా? అని అందరూ అనుకున్నారు. అలా మోనాల్ మీదున్న నెగెటివిటీ కాస్త హారిక మీదకు మళ్లింది. అందుకే హారిక టాప్ 5 స్థానాన్ని మాత్రమే కైవసం చేసుకోగలిగింది. అలా హారిక మోనాల్‌లు బిగ్ బాస్ ఇంట్లో చాలానే దగ్గరయ్యారు. అయితే హారికను ఎత్తుకుని నిలబడం, కెప్టెన్‌ను చేయడంతో మోనాల్ సత్తా ఏంటో అందరికీ తెలిసిందే.

అప్పటి నుంచే ఇద్దరి మధ్య మరింత బంధం నెలకొంది. అలా మోనాల్‌ను బిగ్ బాస్ ఇంట్లో ఎన్నో సార్లు హగ్ చేసుకుంది.. ఆమె కనిపిస్తే ఆమె మీదకు ఎక్కేసేది. ఇప్పుడు కూడా హారికకు అదే అలవాటైన్నట్టుంది. మోనాల్ డ్యాన్స్ ప్లస్ షోలో జడ్జ్‌గా కూర్చుంది. హారిక కంటెస్టెంట్ మాదిరి డ్యాన్స్ చేసింది. పర్ఫామెన్స్ తరువాత మోనాల్ స్టేజ్ మీదకు వస్తుంటే.. పరిగెత్తుకుంటూ వెళ్లి మోనాల్ మీదకు ఎక్కేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.