Mokshagna: నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈయన సినీ ఎంట్రీకి చాలా ఆలస్యమైంది అయితే ఏడాదిలోనే మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఉండబోతుందంటూ అభిమానులందరూ భావించారు. అందుకు అనుగుణంగానే ఈయన ఫస్ట్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇక ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరుపుకోవాలని అన్న తరుణంలోనే ఈ సినిమా ఆగిపోయిందని మరొక వార్త కూడా వైరల్ అవుతుంది.
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా ఉండబోతుందని వెల్లడించారు. అయితే ఈ సినిమా విషయంలో ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథ నేనే అందిస్తాను కానీ దర్శకుడు మాత్రం నా అసిస్టెంట్ ఉంటారని చెప్పడంతో అందుకు బాలకృష్ణ ఒప్పుకోలేదని ప్రశాంత్ వర్మ బదులుగా మరొక కొత్త డైరెక్టర్ ను లైన్లో పెట్టే ఆలోచనలో బాలకృష్ణ ఉన్నారని తెలుస్తోంది. ఇలా ఈ సినిమాకు ఆదిలోనే ఆటంకం ఏర్పడిందనే విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. మరి ఈ సినిమా విషయంలో వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా తాజాగా మోక్షజ్ఞ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. తన తండ్రి ఆచూకీ తెలిపితే కనుక వారికి 50 లక్షల ప్రైజ్ మనీ అంటూ ఈయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది అసలు మోక్షజ్ఞ ఇలాంటి పోస్ట్ చేయడం వెనుక కారణమేంటి బాలయ్య ఎక్కడికి వెళ్లారు అనే అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి. అయితే మోక్షజ్ఞ ఈ పోస్ట్ చేయడానికి గల కారణం ఆయన నటిస్తున్న డాకు మహారాజ్ సినిమా కారణమని తెలుస్తోంది.
మోక్షజ్ఞ.. తన సోషల్ మీడియా వేదికగా వాంటెడ్ డాకు మహారాజ్ అని పోస్ట్‌ను షేర్ చేసుకున్నాడు. రూ.50 లక్షల ప్రైజ్ మనీ అంటూ రాసుకోవచ్చారు.ఈ పోస్టులో డాకు మహారాజ్ మూవీలో.. బాలయ్య డాకు మహారాజ్ పిక్ పై వాంటెడ్ ట్యాగ్ జోడిస్తూ షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం మోక్షజ్ఞ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
💥💥 Wanted 💥💥
Daaku Maharaaj 🔥
Price Money: 50,00,000/-👍✅
Story, Screenplay, DOP 🔥🔥🔥
It’s Beyond Your Imagination 🙏💯#DaakuMaharaaj #NBK #Balayya pic.twitter.com/UO6sO1WVsr— Nandamuri Mokshagna Teja (@Mokshagna_Actor) December 16, 2024