Roja: సేవ కార్యక్రమాలలో తల్లిని మించి పోయిన రోజా కూతురు.. ఏం చేసిందంటే!

Roja: ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతున్న రోజు ఒకప్పటి స్టార్ హీరోయిన్. రోజా ఎన్నో చిత్రాలలో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఒకవైపు కుటుంబం, మరొక వైపు రాజకీయం, మరొకవైపు టీవీ షో లలో రోజా ఎప్పుడు బిజీగా ఉంటుంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రోజా చాలా బిజీ ఐపోయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నగరి ఎమ్మెల్యే గా రెండు సార్లు గెలుపొంది. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత రోజా పలు సేవా కార్యక్రమాలను చేపట్టింది.

రోజా ముద్దుల కూతురు అన్షు మాలిక కూడా సేవాకార్యక్రమాలలో తల్లిని మించి పోయింది. చిన్న వయసులోనే పలు సేవా కార్యక్రమాలు చేస్తూ తల్లిని మించి పోయింది. వెబ్ డెవలపర్ గా, కంటెంట్ క్రియేటర్ గా, రైటర్ గా, సోషల్ వర్కర్ గా తన ప్రతిభ చూపుతూ ఈతరం పిల్లలకు ఆదర్శంగా నిలుస్తోంది. తల్లిదండ్రులు లేని అయిదుగురు అనాధ పిల్లలను చీఫ్ ఫౌండేషన్ ద్వారా దత్తత తీసుకొని వారి బాధ్యతలను తీసుకుంది. అన్షు మాలిక స్మైల్ హండ్రెడ్ అనే మరో సంస్థ స్థాపించి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న వంద మంది పిల్లలను ఎంపిక చేసి వారి ఉన్నత చదువుల కోసం కృషి చేస్తోంది.

అంతేకాకుండా తాను చిన్న వయసులోనే స్కూల్ నుండి వచ్చిన తర్వాత కాల్ ఈ సమయంలో చుట్టుపక్కల ఉన్న నిరుపేద పిల్లలకు ట్యూషన్ చెప్పేది.కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న పిల్లలకు దిశానిర్దేశం చేయడానికి ట్రాన్స్ ఫార్మింగ్ లైఫ్ విత్ కోడింగ్ అనే పేరుతో ఒక స్కూల్ క్లబ్ కూడా స్టార్ట్ చేసింది అన్షు మాలిక. అతి చిన్న వయసులోనే తన మంచి మనసు చాటుకున్న అన్షు మలికను కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.