అఫీషియల్ : “ఆదిపురుష్” కి వణుకు పుట్టించిన చిన్న సినిమా వాయిదా.!

నిజానికి ఈ ఏడాది సంక్రాంతి రిలీజ్ లోనే రిలీజ్ కావాల్సి ఉన్న చిత్రాల్లో యంగ్ రెబల్ స్టార్ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ హీరోయిన్ గా నటించిన భారీ పాన్ ఇండియా సినిమా “ఆదిపురుష్”. కాగా ప్రభాస్ మొదటి సారిగా చేసిన బాలీవుడ్ సినిమా అందుకొని రామాయణం ఆధారంగా చేసిన సినిమా ఇది కావడంతో దీనిపై భారీ అంచనాలు మొదటి నుంచి నెలకొన్నాయి.

కానీ సినిమా టీజర్ చూసాక ఒకొక్కరికి మైండ్ బ్లాక్ అయ్యింది. అయితే ఈ చిత్రం తర్వాత మన టాలీవుడ్ నుంచి ఓ చిన్న హీరో సినిమా “హనుమాన్” అనే పేరిట తెరకెక్కిస్తున్న దాని నుంచి వచ్చిన టీజర్ చూసి ఒకొక్కరు షాక్ అయ్యారు. ఆదిపురుష్ బడ్జెట్ తో పదవ వంతు కూడా చేయని ఈ సినిమాకి ఈ రేంజ్ విజువల్స్ ఏంట్రా అని అంతా అనుకునేలా చేసింది.

దీనితో ఓ రకంగా తెలుగు ఆడియెన్స్ లో అయితే ఆదిపురుష్ కన్నా హనుమాన్ కోసం ఎదురు చూసినవాళ్ళే ఎక్కువ. పైగా హనుమాన్ కోసం మాట్లాడ్డం ఎక్కువ కావడం హిందీలో కూడా ఆదిపురుష్ కన్నా హనుమాన్ టీజర్ కోసం మాట్లాడ్డం ఆదిపురుష్ మేకర్స్ కి చిన్నపాటి వణుకు కూడా పుట్టించింది.

కాగా ఇప్పుడు హనుమాన్ సినిమా రిలీజ్ పై అయితే మేకర్స్ ఇపుడు బిగ్ అప్డేట్ అందించారు. ఈ మే 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ సినిమా అనుకున్న సమయానికి రావట్లేదని తెలిపారు. ఈ సినిమా డెఫినెట్ గా అంచనాలు అయితే అందుకుంటుంది అని అంటున్నారు.

ఇంకా గ్రాఫిక్ వర్క్స్ పెండింగ్ ఉండడం వల్ల ఆన్ టైం తీసుకు రాలేకపోతున్నామని కొత్త డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేస్తామని కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ సినిమాలో తేజ సజ్జ అయితే హీరోగా నటించగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాని ఒక ఫిక్షనల్ ఊరిలో ప్లాన్ చేసాడు.