ప్రెజెంట్ పాన్ ఇండియా సినిమా దగ్గర వండర్స్ చేయడానికి రెడీగా ఉన్న నెక్స్ట్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది యంగ్ రెబల్ స్టార్ అండ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ నుంచి వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ “సలార్” అనే చెప్పాలి. ప్రభాస్ లాంటి మాస్ హీరోతో కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు సినిమా అంటే అనౌన్స్ చేసినప్పుడు నెక్స్ట్ లెవెల్ హైప్ ఈ చిత్రం అందుకోగా ఇప్పుడు సినిమా రిలీజ్ దగ్గరకి కూడా వస్తుంది.
కాగా ఈ చిత్రం పై ఉన్న క్రేజ్ తో ఇప్పటికే భారీ ఆఫర్స్ పలుకుతున్న హక్కులు మైండ్ బ్లాకింగ్ గా ఉన్నాయి. అయితే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల బిజినెస్ కి సంబంధించి కూడా పలు రూమర్స్ ఎప్పుడు నుంచో ఉండగా లేటెస్ట్ గా అయితే ఈ బిజినెస్ కోసమే ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది.
కాగా ఇంకా తెలుగు స్టేట్స్ లో అయితే సలార్ బిజినెస్ ఇంకా పూర్తి కాలేదు అట. ఐతే నిర్మాతలు ఈ సినిమా హక్కులకు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి రికార్డు మొత్తంలో అడుగుతున్నారట దీనితో వారు అందుకే ఇంకా ఎలాంటి డీల్ చేయలేదు అని తెలుస్తుంది.
కానీ కన్నడ నుంచి కొన్ని సినీ వర్గాల సమాచారం ప్రకారం సలార్ కి తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 185 కోట్లకి పైగా బిజినెస్ జరుగుతునట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై సరైన అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది. మరి ఇంత మొత్తం అయితే ఓ ఊహించని ఫిగర్ అని చెప్పాలి. ఇప్పటివరకు RRR చిత్రమే 200 కోట్లకి పైగా తెలుగు స్టేట్స్ లో బిజినెస్ ని చేసుకుంది.