యూఎస్ బాక్సాఫీస్ దగ్గర మైండ్ బ్లాక్ చేస్తున్న “సలార్”..!

పాన్ ఇండియా సినిమా దగ్గర బిగ్గెస్ట్ స్టార్ గా నిలిచిన ప్రభాస్ హీరోగా ఇపుడు చేస్తున్న పలు చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న మాసివ్ పాన్ ఇండియా చిత్రం “సలార్ ది సీజ్ ఫైర్” కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రం రిలీజ్ కి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ యూఎస్ లో అయితే బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి.

కాగా ఈ బుకింగ్స్ కి ఇప్పుడు సెన్సేషనల్ రెస్పాన్స్ నమోదు అవుతుండడం షాకింగ్ గా మారింది. నిజానికి ఈ ఆగస్ట్ 25 నుంచి బుకింగ్స్ ఓపెన్ కావాల్సి ఉంది కానీ ఊహించని విధంగా మరికాస్త ముందే బుకింగ్స్ ఓపెన్స్ చేసేసారు. అయితే వీటికి క్రేజీ రెస్పాన్స్ ఇప్పుడు నమోదు అవుతుంది.

జస్ట్ ఈ ఒక్క రోజులోనే సలార్ ప్రీమియర్ వసూళ్లు లక్ష డాలర్స్ కి పైగా దాటేశాయి. ప్రస్తుతం అయితే లక్ష 30 వేల డాలర్స్ కి చేరినట్టుగా కూడా తెలుస్తుంది. దీనితో అసలు యూఎస్ లో ఈ సినిమాకి క్రేజ్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే కొందరు ట్రేడ్ పండితులు ఈ చిత్రం ప్రీమియర్స్ తో RRR చిత్రాన్ని కూడా క్రాస్ చేసే ఛాన్స్ ఉంది అని ఇపుడు నుంచే అంటున్నారు.

మరి నిజంగా ఈ చిత్రం అలా చేస్తే ప్రభాస్ కి తిరుగు లేదనే చెప్పాలి. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా పృథ్వీ రాజ్ సుకుమారన్ అలాగే జగపతిబాబు తదితరులు నటించగా హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు అలాగే ఈ చిత్రం కేజీఎఫ్ చిత్రాలతో లింక్ ఉండనే టాక్ తో మరింత హైప్ తెచ్చుకుంది.