పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ లలో అయితే ఈ ఏడాది రిలీజ్ కి సిద్ధంగా ఉన్న లేటెస్ట్ చిత్రం “సలార్”. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ అయితే తెరకెక్కించగా ఇప్పుడు అనేక అంచనాలు దీనిపై నెలకొన్నాయి.
అయితే అందుకు తగ్గట్టుగానే ఈ భారీ సినిమా వరల్డ్ వైడ్ గా ఊహించని లెవెల్లో రిలీజ్ కానుండగా ఐతే ఈ చిత్రం ఫస్ట్ టైం ఇంగ్లీష్ వెర్షన్ లో కూడా ప్రభాస్ సహా ప్రశాంత్ నీల్ కెరీర్ నుంచి రానున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ భారీ చిత్రం నిన్ననే యూఎస్ వెర్షన్ కి సంబంధించి ఏకంగా 1974 లొకేషన్స్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయగా.
ఇది అయితే ఓ ఇండియన్ సినిమాకి యూఎస్ లో బిగ్గెస్ట్ రికార్డు అయితే ఇదొక్కటే కాకుండా ఇండియా మినహా మిగతా వరల్డ్ అంతా కూడా ఊహించని విధంగా ఏకంగా 5 వేలకి పైగా లొకేషన్స్ లో అయితే రిలీజ్ చేస్తున్నట్టుగా ప్లాన్ చేస్తున్నారట. మరి ఇది కూడా ఇండియన్ సినిమా నుంచి హైయెస్ట్ నెంబర్ సినిమా అట.
దీనితో ఈ చిత్రం ఒక మైండ్ బ్లాకింగ్ రిలీజ్ అని చెప్పాలి. ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్ అయితే ఈ సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా పృథ్వీ రాజ్ అలాగే తదితర స్టార్ కాస్టింగ్ నటిస్తున్నారు.