క్రేజీ : “కేజీఎఫ్” – “సలార్” లింక్.. మైండ్ బ్లాక్ చేస్తున్న లాజిక్స్.!

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర వినిపిస్తున్న ఒకే ఒక్క సినిమా పేరు “సలార్”. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి ఈరోజు సెన్సేషనల్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేయగా ఈ టీజర్ కి ఇప్పుడు రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ వస్తుంది.

అయితే ఈ చిత్రంపై ఉన్న హైప్ మరింత ఎక్కించేలా ఈ సినిమా కేజీఎఫ్ 2 లేదా ఈ సిరీస్ కి లింక్ అయ్యి ఉంటుంది అని ఓ క్రేజీ సమాచారం మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనితో దర్శకుడు అసలు ఎలా ఈ చిత్రాలు కలుపుతాడు అనేది మరింత ఎగ్జైటింగ్ గా మారగా ఈరోజు సలార్ టీజర్ వచ్చాక అనేక థియరీలు బయటకి వస్తున్నాయి.

మరి కేజీఎఫ్ చాప్టర్ 2 లో రాకీభాయ్ నిర్మించుకున్న తన సామ్రాజ్యం లో కొన్ని ఫ్యాకర్టీ నంబర్స్ అలాగే ఇపుడు సలార్ టీజర్ లో చూపించిన నంబర్స్ ఒకేలా ఉన్నాయి. దీనితో ఈ రకంగా లింక్ ఉందని కన్ఫర్మ్ కాగా మరో కీలక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే ఈ టీజర్ లో ఆఫ్రికన్స్ గ్యాంగ్ కనిపిస్తున్నారు.

మరి కేజీయఫ్ 1 లోకి వెళితే అందులో బంగారం ఆఫ్రికా నుంచి రావట్లేదు కేజీఎఫ్ నుంచే వస్తుంది అని రాకీ తెలుసుకున్నాడు అని ఉంటుంది. అంటే ఆ ఆఫ్రికా కనెక్షన్ ఇలా కుదిరిందా అని చెప్పుకోవచ్చు. అలాగే సలార్ అనేది ముస్లిం పేరు కాబట్టి చాప్టర్ 2 లో చూపించిన ఇనాయత్ ఖలీల్ కొడుకు కానీ సలార్ నా అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇలా సలార్ కి కేజీఎఫ్ కి ఇంట్రెస్టింగ్ లైన్స్ ఇప్పుడు కలుస్తూ ఉండడం మరింత క్రేజీ థింగ్ గా ఇప్పుడు మారింది.