బాలీవుడ్ లో కొత్త బ్లాస్ట్..మైండ్ బ్లాకింగ్ గా ‘యానిమల్’ ప్రీ టీజర్.!

ఇప్పుడు మళ్ళీ చాన్నాళ్ళకి బాలీవుడ్ సినిమా అయితే తమ పూర్వ వైభవాన్ని అందుకుంటుంది. ఒకప్పుడు ఇండియన్ సినిమాకి ఫేస్ గా ఉండే బాలీవుడ్ ఇప్పుడు చాలా స్ట్రగుల్ అవుతుంది. ఇక నెమ్మదిగా మన తెలుగు సినిమాలు ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా మారడం మన తెలుగు దర్శకులు హిందీలో వెళ్లి సినిమాలు తీస్తూ బాలీవుడ్ కి కొత్త ఊపుని ఇచ్చారు.

మరి అలా హిందీలో తన మొదటి సినిమాతోనే అందుకొని ఏ సర్టిఫైడ్ చిత్రంతో భారీ వసూళ్లు అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. మరి ఈ అర్జున్ రెడ్డి దర్శకుడు హిందీలో ఇప్పుడు చేస్తున్న రెండో సినిమానే “యానిమల్”. పేరే మోస్ట్ పవర్ ఫుల్ గా ఉండగా ఈ చిత్రంలో హీరోగా అయితే మోస్ట్ వెర్సటైల్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్నాడు.

ఇక హిందీలో పిచ్చ హైప్ తో ఉన్న ఈ సినిమా రిలీజ్ ఇంకా నెల ముందు ముందు ఓ ప్రీ టీజర్ ని మేకర్స్ ఇప్పుడు రిలీజ్ చేశారు. మరి ఈ సాలిడ్ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన ఈ టీజర్ మాత్రం మైండ్ బ్లాకింగ్ అని చెప్పొచ్చు. కొందరు రౌడీ లు డిఫరెంట్ మాస్క్ లు పెట్టుకొని గొడ్డళ్లతో ఉన్నారు.

మరోపక్క కొందరు హిందీ సాంగ్ పడుతున్నారు అప్పుడు ఆ మాస్కస్ పెట్టుకున్న రౌడీ ల ముందుకు వచ్చిన రణబీర్ చేసిన ఏక్షన్ సీక్వెన్స్ ఊహించని లెవెల్ అని చెప్పాలి. అసలు ఈ రేంజ్ లో ఉంటుంది అని బహుశా ఎవరూ కూడా ఊహించి ఉండరు. దీనితో డెఫినెట్ గా ఈ చిత్రం బాలీవుడ్ లో మరో బ్లాస్ట్ అవుతుంది అని అంతా అనుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మికా మందన్నా నటిస్తుండగా టి సిరీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. 
ANIMAL(PRE-TEASER):Ranbir Kapoor|Sandeep Reddy Vanga|Bhushan Kumar|Worldwide Release on 1st Dec 2023