స్టార్ హీరోయిన్ తమన్నా సౌత్ మరియు బాలీవుడ్ పరిశ్రమల్లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కథానాయికగా ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు చేసిన ఆమె గత కొంతకాలంగా స్పెషల్ సాంగ్స్ తోనూ ప్రేక్షకులను అలరిస్తోంది. తనకు ఉన్న గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ స్కిల్స్ తో ఏ సినిమాలో ఐటెం సాంగ్ చేసినా, సినిమా హిట్ అయ్యే అవకాశం పెరుగుతుందని అనిపిస్తుంటుంది.
కెరీర్ మొదట్లోనే, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘అల్లుడు శీను’ చిత్రంలోని ”లబ్బర్ బొమ్మ’’ పాటలో తన డ్యాన్స్ తో ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసింది. తర్వాత ‘‘జై లవకుశ’’, ‘‘గని’’, ‘‘స్పీడున్నోడు’’ వంటి చిత్రాలలో చేసిన స్పెషల్ సాంగ్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి. అయితే, ఆ మధ్య విడుదలైన సూపర్ స్టార్ రజినీకాంత్ ‘‘జైలర్’’ సినిమాలోని ‘‘నువ్వు కావాలయ్యా’’ పాటలో తమన్నా గ్లామర్ షోతో మరోసారి తన ప్రత్యేకతను చూపించింది. ఈ పాటకు వచ్చిన సక్సెస్ సినిమాకు ముందస్తు హైప్ ను పెంచడంలో కీలక పాత్ర పోషించింది.
అంతే కాదు, తమన్నా పెంచిన గ్లామర్ డోస్ వల్ల పాట ట్రెండింగ్ లో నిలిచింది. తాజాగా తమన్నా మరో స్పెషల్ సాంగ్ తో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈసారి బాలీవుడ్ లో ‘స్త్రీ 2’ మూవీలో ‘‘ఆజ్ కా రాత్’’ అనే స్పెషల్ సాంగ్ లో చిందులేసింది. 2018లో విడుదలైన ‘స్త్రీ’ మూవీలో నోరా ఫతేహి ఐటెం సాంగ్ చేస్తే, ఇప్పుడు సీక్వెల్ లో తమన్నా గ్లామర్ తో అదరగొట్టింది. ఇక సోషల్ మీడియాలో కూడా అమ్మడు తన గ్లామర్ తో ట్రెండ్ అవుతోంది.
రీసెంట్ గా ఫొటో షూట్ లో అమ్మడు చీరలో మాయ చేసేసింది. ఒక స్టిల్ లో చీరకొంగు పై అలా నీళ్ళు చల్లుతూ కనిపించింది. గతంలో ఎన్నోసార్లు గ్లామర్ స్టిల్స్ ఇచ్చిన అమ్మడు ఈ రేంజ్ లో మ్యాజిక్ చేయలేదని కొందరు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం తమన్నా పలు చిత్రాలలో నటిస్తూ, స్పెషల్ సాంగ్స్ తోనూ దూసుకెళ్తోంది. అయితే, గ్లామర్ సాంగ్స్ కన్నా కొత్త కథాంశాలున్న చిత్రాల్లో నటనకు ప్రాధాన్యత ఇస్తే, ఆమె కెరీర్ మరింత మెరుగ్గా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.