శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమా ద్వారా టాలివుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మంచి హిట్ అవడంతో తమన్నకి హీరోయిన్ గా టాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీలలో మంచి అవకాశాలు వచ్చాయి. ఇలా సార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకున్న తమన్నా తన అందం అభినయంతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకొని స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో బాలీవుడ్ నుండి కూడా మంచి మంచి ఆఫర్స్ రావడంతో తెలుగు సినిమాలకు దూరమై బాలీవుడ్ లో సెటిల్ అయింది.
అక్కడ కూడా బాలీవుడ్ హీరోల సరసన వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటున్న తమన్నా కి సరైన హిట్ లేకపోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. ఇటీవల బాలీవుడ్ లో తమన్నా కీలకపాత్రలో నటించిన “లేడీ బౌన్సర్” సినిమా ఇటీవల విడుదలై ప్లాప్ అయ్యింది. ఇంతకాలం వరుస సినిమా అవకాశాలు రావడంతో పెళ్లి గురించి ఆలోచించని తమన్నా ఇప్పుడు అవకాశాలు తగ్గటంతో పెళ్లి పై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ క్రమంలో తమన్నా మాట్లాడుతూ… ఇంతకాలం సినిమాలతో బిజీగా ఉండటం వల్ల పెళ్ళి గురించి ఆలోచించే సమయం లేదు. అంతే కానీ పెళ్లి కి నేను వ్యతిరేకిని కాను. తొందర్లోనే పెళ్ళి చేసుకొని పిల్లల్ని కనాలనే ఆలోచనలో ఉన్నానని తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వయసు పెరుగుతున్న కొద్దీ అవకాశాలు తగ్గడంతో పెళ్లికి రెడీ అయిన తమన్నా ఇప్పటికే ఎవరో ఒకరిని సెట్ చేసుకొని ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే… ప్రస్తుతం తమన్నా బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగులో ఒక సినిమాలో నటిస్తూ తమిళ్ లో రజనీ కాంత్ హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా నటిస్తుంది.