మెహరీన్‌ను ఎలా ఏడిపించాడో చూడండి.. వీడియో వైరల్

కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో మెహ్రీన్ తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో అందంగా కనిపించడమే కాదు.. అద్బుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది. అయితే మెహ్రీన్ ఈ ఒక్క చిత్రంలోనే బాగా నటించింది. మిగిలిన చిత్రాల్లన్నింటిలో ఒకేలా నటించింది. ఒక్కటంటే ఒక్క ఎక్స్‌ప్రెషన్ సరిగా ఇవ్వడం రాదంటూ ఆ మధ్య నెటిజన్లు ఏకిపారేశారు. ఏడ్చినా, నవ్వినా ఒకే ఒక ఎక్స్‌ప్రెషన్ ఇస్తుందని కామెంట్లు వినిపించాయి.

అయితే మెహ్రీన్‌కు మాత్రం అవకాశాలు బాగానే వస్తున్నాయి. సినిమాలు హిట్ అయినా కాకున్నా ఆఫర్స్ రావడం మాత్రం వింతగానే ఉంటుంది. మెహ్రీన్ నటించిన ఎఫ్2 తప్పా మరే చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. మెహ్రీన్ చేసిన సినిమాలన్నీ బోల్తా కొడుతూనే ఉన్నాయి. అయినా సరే ఆఫర్స్ మాత్రం తగ్గడం లేదు. చివరగా నాగశౌర్య సరసన అశ్వథ్థామ చిత్రంలో నటించింది. అది కూడా ఓ చేదు అనుభవాన్నే మిగిల్చింది.

సినిమాలు ఎలా ఉన్నా గానీ ఈ అమ్మడు సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ సుందరి ఓ వీడియోను షేర్ చేసింది. ఓ ఐస్ క్రీమ్ పార్లర్ అతను ఐస్ క్రీం ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ లాగేసుకుంటున్నాడు. అయితే చివరకు ఇచ్చాడో లేదో క్లారిటీ ఇవ్వలేదు గానీ.. ఐస్ క్రీం కోసం చాలానే కష్టపడట్టు కనిపిస్తోంది. ఇది దుబాయ్‌లో గతంలో జరిగిన సంఘటన అని చెప్పింది.