పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాలలో అడుగుపెట్ట హీరోగా మారిన చిరంజీవి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెగాస్టార్ గా గుర్తింపు పొందాడు. చిరంజీవి ఇలా స్టార్ హీరోగా మారిన తర్వాత తన కుటుంబం నుంచి ఎంతోమందిని హీరోలుగా ఇండస్ట్రీలో పరిచయం చేశాడు. ఈ క్రమంలో తన తమ్ముళ్లు పవన్ కళ్యాణ్ కూడా స్టార్ హీరోగా గుర్తింపు పొందగా నాగబాబు మాత్రం హీరో కాలేకపోయాడు.

 

ఇక ఇటీవల చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా విజయం అందుకోవటంతో ఇటీవల విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో చిరంజీవి సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను విలేకరుల సమావేశంలో ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఈ క్రమంలో విలేకరి అడిగిన ఒక ప్రశ్నకు చిరంజీవి ఆసక్తికర సమాధానం చెప్పాడు.’ పవన్ కళ్యాణ్ కలసి నటించే అవకాశం ఉందా ? అని విలేకరి అడగ్గా.. చిరు స్పందిస్తూ.. ” తమ్ముడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని నాకు కూడా సరదాగా ఉంది. అలాగే నాతో సినిమా చేయాలని పవన్ కళ్యాణ్ కి కూడా ఉంటుంది.

 

అన్నీ కుదిరిన రోజున ఇద్దరం కలిసి సినిమా చేయాలని చాలా ఉత్సాహంగా ఉంది’ అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలతో మెగా అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఒకసారి మెగా బ్రదర్స్ ఇద్దరిని కూడా ఒకే స్క్రీన్ మీద చూసే అవకాశం కోసం ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉండగా గాడ్ ఫాదర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి తర్వాత వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.