Regina Cassandra: మెగాస్టార్ సినిమా కనుక చేయడానికి ఒప్పుకున్నా… రెజీనా షాకింగ్ కామెంట్స్!

Regina Cassandra: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రెజీనా ఒకానొక సమయంలో మీడియం రేంజ్ హీరోలందరి సరసన నటించిన మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకోలేకపోయింది.ఇకపోతే రెజీనా గత కొద్దిరోజుల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ క్రమంలోనే ఈమె మీడియాతో ముచ్చటించింది. రెజీనా ఐటమ్ సాంగ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సినిమా ద్వారా ఐటమ్ సాంగ్ లో నటించిన ఈమె తర్వాత సినిమాలలో కూడా ఐటమ్ సాంగ్స్ చేయడానికి అవకాశం ఉందా అని ప్రశ్నించగా ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ ఇకపై తాను ఎప్పుడూ కూడా ఇలాంటి సాంగ్స్ లో నటించని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.ఈ సినిమాలో చేయక ముందు కూడా తనకు ఇలాంటి అవకాశాలు చాలా వచ్చాయని అయితే తనకు ఇలా ఐటమ్ సాంగ్స్ లో నటించడం ఏ మాత్రం ఇష్టం లేదని తెలిపారు.

ఆచార్య సినిమాలో నటించడం విషయానికి వస్తే తనకు ఎప్పటినుంచో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించాలనే కోరిక ఉంది. అయితే తనకు ఇలా అవకాశం వచ్చిందని, మెగాస్టార్ సినిమా కనుకే ఈ సినిమాలోని ఐటెం సాంగులో తాను నటించానని, ఇకపై ఇలాంటి ఐటమ్ సాంగ్స్ లో తాను నటించనని ఈమె వెల్లడించారు.