కొత్త లుక్ లో మెగాస్టార్ చిరంజీవి.. షాక్ అవుతున్న మెగా ఫ్యాన్స్

megastar chiranjeevi new look goes viral

మెగాస్టార్ చిరంజీవి ఏం చేసినా సంచలనమే. ఇదివరకు కూడా ఒకసారి మీసాలు, గడ్డం తీసేసి నవయువకుడిలా దర్శనమిచ్చారు చిరు. ఇప్పుడు సడెన్ గా పూర్తి గెటప్ మార్చేశారు. సరికొత్త లుక్ లో మెగా ఫ్యాన్స్ కు దర్శనమిచ్చారు.

megastar chiranjeevi new look goes viral
megastar chiranjeevi new look goes viral

మీరు చూస్తున్న ఆ ఫోటోనే సరికొత్త లుక్ లో ఉన్న మెగాస్టార్ ది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్  లో చిరు ఈ ఫోటోను షేర్ చేశారు. దానితో పాటు.. అర్బన్ మాంక్ అనే హ్యాష్ టాగ్ తో ఈ ఫోటోను షేర్ చేశారు చిరు. అంటే నగర సాధువు అని అర్థం. సాధారణంగా సాధువులు, సన్యాసులు గుండు కొట్టించుకొని అడవుల్లో ఉంటారు కదా. ఆ ఉద్దేశంతో చిరు నగర సాధువు అని హ్యాష్ టాగ్ ఇచ్చి ఉంటారు అని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

నేను సాధువులా ఆలోచించగలనా? అంటూ మరో లైన్ కూడా యాడ్ చేశారు చిరు. ఇక.. ఈ లుక్ ను చూసిన మెగా ఫ్యాన్స్.. బాస్ కు ఏ లుక్ అయినా కరెక్ట్ గా సూట్ అవుద్ది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఒకవేళ ఆచార్య సినిమా కోసం బాస్ ఇటువంటి లుక్ లో దర్శనమిచ్చారా? లేక ఏంటి ఈ లుక్ రహస్యం అనేది మాత్రం ఇంకా అంతుచిక్కడం లేదు.