Chiranjeevi: పేరు మార్చుకున్న మెగాస్టార్ చిరంజీవి.. వైరల్ గా మారిన చరణ్ వీడియో!

Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని ప్రేక్షకులే లేరు. ఇప్పటివరకు బ్రేక్ లేకుండా వరుస సక్సెస్ లతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆచార్య సినిమాలో కూడా బిజీగా ఉన్నాడు. ఈయన సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. నిత్యం ఏదో ఒక పోస్టు తో బాగా సందడి చేస్తాడు.

ఇదిలా ఉంటే తాజాగా తన ట్విట్టర్ లో ఆచార్య అని పేరు మార్చుకున్నాడు. అంతేకాకుండా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ చరణ్ కు సంబంధించిన ఓ వీడియో పంచుకున్నాడు. అందులో చరణ్ రెడీ అవుతుండగా ఒక కోతి వచ్చి అక్కడ సైలెంట్ గా ఉండటంతో అది చూసిన చరణ్ దానికి బిస్కెట్లు కూడా వేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.