ఆ నెంబర్ కోసం లక్షలు ఖర్చు చేసిన మెగాస్టార్

టాలీవుడ్ లో స్టార్ హీరోలకి బ్రాండ్ కార్లు, బైక్స్ పిచ్చి ఎక్కువగా ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ కి ఎక్కువ బైక్స్ ఆసక్తి ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మార్కెట్ లోకి ఏదైనా కొత్తరకం బ్రాండ్ బైక్స్ వచ్చాయంటే కొనడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాగే మెగాస్టార్ చిరంజీవికి కార్లు అంటే ఎక్కువ ఆసక్తి ఉంటుంది.

మార్కెట్ లోకి వచ్చే న్యూస్ బ్రాండ్ కార్స్ ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక కార్ల మీద చిరంజీవికి ఎంత మక్కువ ఉంటుందో అంతకు మించి ఫ్యాన్సీ నెంబర్స్ మీద కూడా ఉంటుంది. తనకి ఇష్టమైన నెంబర్ 1 సిరీస్ ఉండే విధంగా ఫ్యాన్సీ నెంబర్స్ ని లక్షలు పెట్టి కొనడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తాజాగా మెగాస్టార్ మరో న్యూస్ బ్రాండ్ కారుని కొనుగోలు చేశారు.

ప్రస్తుతం మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న టయోటా వెల్ ఫైర్ లగ్జరీ కారుని కోటి రూపాయిలు పెట్టి మెగాస్టార్ కొనుగోలు చేశారు. ఇప్పుడు దానికి నెంబర్ కోసం ఏకంగా 4.50 లక్షలు వెచ్చించడం విశేషం. ముఖ్యంగా ఫ్యాన్సీ నెంబర్ కోసం ట్రై చేసిన మెగాస్టార్ TS09GB1111 నెంబర్ రిజిస్టర్ చేయించుకున్నారు.

దీనికి సంబంధించి ఆయన రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో నెంబర్ 1 సిరీస్ ఉండటం వలనే లక్షల రూపాయిలు ఖర్చు చేసి మెగాస్టార్ కొన్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ ఫ్యాన్సీ నెంబర్స్ క్రేజ్ అనేది సెలబ్రిటీలకి ధనవంతులకి ఎక్కువ ఉంటుంది.

రీసెంట్ గా దుబాయ్ లో ఫ్యాన్సీ నెంబర్ కోసం ఓ వ్యక్తి ఏకంగా 250 కోట్ల రూపాయిలు వెచ్చించాడు. వేలంతో భారీ స్థాయికి పాడుకొని సొంతం చేసుకున్నారు. ఇకా అప్పుడప్పుడు ఫ్యాన్సీ ఫోన్ నెంబర్స్ , వెహికల్ నెంబర్స్ కి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. లక్షల నుంచి కోట్ల రూపాయిలు డిమాండ్ ఉంటుంది.