మాయదారి కరోనా వల్ల సినిమా ఇండస్ట్రీలో ఆ కళే లేదు. షూటింగ్ ల హడావుడే లేదు. ఏదో నామ్ కే వాస్తే షూటింగ్ లు ప్రారంభం అయ్యాయి తప్పితే… మునుపటి కళ అయితే ఇండస్ట్రీలో కనిపించడం లేదు. ఇప్పుడిప్పుడే… భయపడుతూనే కొన్ని సినిమాలు పట్టాలకెక్కుతున్నాయి. షూటింగులు జరుపుకుంటున్నాయి.
పెద్ద పెద్ద స్టార్ల సినిమాల షూటింగులు కూడా ప్రారంభం అయ్యాయి. ప్రభాస్.. రాధేశ్యామ్ షూటింగ్ కోసం ఏకంగా ఇటలీ వెళ్లాడు. నాగార్జున కూడా ఓవైపు బిగ్ బాస్ షోకు హోస్ట్ చేస్తూనే.. వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇలా అందరు స్టార్ హీరోలు తమ సినిమాల షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు.
మెగాస్టార్ కూడా ఆచార్య సినిమా షూటింగ్ కోసం నవంబర్ 4 నుంచి మేకప్ వేసుకోబోతున్నారనే వార్తలు రావడంతో.. మెగాస్టార్ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఖుషీ అయ్యారు. హమ్మయ్య.. అన్నయ్య సినిమా షూటింగ్ ప్రారంభం అవుతోంది అంటే… వచ్చే వేసవికైనా విడుదలవుతుంది.. అని భావించారు.
కానీ.. ఆచార్య షూటింగ్ ఇప్పుడప్పుడే పట్టాలకెక్కేలా కనిపించడం లేదు. ఆచార్య షూటింగ్ ను ఇంకొన్ని రోజులు పోస్ట్ పోన్ చేశారట… దానికి కారణం స్క్రిప్ట్ లో చోటు చేసుకున్న మార్పులేనట. వచ్చే సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత ఆచార్య షూటింగ్ ప్రారంభం అవుతుందట. ఈ మధ్యలో చిరంజీవి లూసిఫర్ లేదంటే వేదాళం సినిమా రీమేక్ లో నటిస్తారని వార్తలు వస్తున్నాయి.
ముందు స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి చేసుకున్నప్పటికీ.. ఆచార్య సినిమాపై గత కొన్ని రోజుల నుంచి వివాదాలు వస్తున్న విషయం తెలిసిందే. ఆచార్య సినిమా కథ కాపీ అంటూ ఓ రచయిత గొడవ చేశాడు. దీంతో.. స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నారని.. అది అయ్యేలోపు కాస్త సమయం పడుతుందని.. అందుకే… వచ్చే సంక్రాంతి తర్వాత షూటింగ్ ను ప్రారంభించాలని అనుకుంటున్నారట. దీంతో మెగాఫ్యాన్స్ లో ఉన్న ఉత్సాహం ఒక్కసారిగా నీరుగారిపోయింది.