Mega Star: మెగాస్టార్ భోళాశంకర్ బిగ్ అప్డేట్… ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్…!

Mega Star: మెగా స్టార్ చిరంజీవి వరుస సినిమాలతో అభిమానులకు ఆనందాన్ని ఇస్తున్నారు. ఆచార్య సినిమాలో దేవాలయ భూముల ఆక్రమణ మీద పోరాడే వ్యక్తిగా కనిపించనున్నారు. ఇక ఇందులో చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నక్సలైట్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించునున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ కు జోడిగా పూజ హెగ్డే నటించారు. ఆచార్య చిత్రంలోని పాటలకు, ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. కొరటాల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా పై చాలానే అంచనాలు ఉన్నాయి.

ఇక ఆచార్య తర్వాత చిరంజీవి తన తదుపరి చిత్రాలకు సిద్ధమవుతున్నారు. గాడ్ ఫాదర్, భోళా శంకర్ చిత్రాలలో నటించబోతున్నారు. భోళా శంకర్ సినిమా విషయానికి వస్తే కీర్తి సురేష్ చిరంజీవి చెల్లి పాత్రలో కనిపించునున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినా వీరిద్దరూ ఉన్న పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. ఇక ఇపుడు ఫస్ట్ లుక్ రిలీజ్ కు చిత్ర యూనిట్ సిద్ధం అవుతోంది. మార్చి 1న సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్, ఏ కే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాయి. ఇక రామ బ్రహ్మం సుంకర నిర్మాత కాగా అనిల్ సుంకర పర్యవేక్షిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి మెగాస్టార్ ఫస్ట్ లుక్ ను మహా శివరాత్రి సందర్బంగా మార్చి 1 న 9గంటల 5నిమిషాలకు విడుదల చేయనున్నారు. భోళా శంకర్ సినిమా తమిళ సినిమా వేదాళం సినిమాకు రీమేక్. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సినిమా సాగుతుంది చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది లోనే విడుదలకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈక్రమంలోనే చిరంజీవి ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.