గాడ్ ఫాదర్ లో మరో స్టార్ హీరో ఉన్నాడా?

తన నలభై ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్స్, అలాగే కొన్ని పరాజయాలు  చూసిన చిరంజీవి ఎప్పడూ లేని విధంగా తన ‘ఆచార్య’ సినిమా ప్లాప్ ని ఈజీ గా తీసుకోలేకపోతున్నారు. అవసరం ఉన్నా, లేకున్నా ఆ సినిమా పరాజయానికి దర్శకుడు మాత్రమే కారణం అని వీలున్నప్పుడల్లా కొరటాల శివ ని విమర్శిస్తూనే ఉన్నాడు.

ఇప్పుడు తన ఆశలన్నీ ‘గాడ్ ఫాదర్’ సినిమా పైనే పెట్టుకున్నాడు. ఈ మూవీ మీద క్రేజ్ పెంచడానికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ని స్పెషల్ రోల్ కి ఒప్పించాడు. ఇంకో రెండు రోజుల్లో వస్తున్న ఈ మూవీ పై అంచనాలు బాగానే ఉన్నాయి.

తాజాగా అందిన సమాచారం ప్రకారం ‘గాడ్ ఫాదర్’ సినిమాలో సల్మాన్ ఖాన్ తో బాటు రామ్ చరణ్ కూడా ఒక కీలక రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో సల్మాన్ ఖాన్ ఈ విషయాన్నీ రివీల్ చేసాడు.  ఈ సినిమాకి  మోహన్  రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మలయాళం మూవీ ‘లూసిఫెర్’ కి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం అక్టోబ‌ర్ 05 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.